ఆర్బీఐకి ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు - సమాచారం ఇవ్వాల్సిందే
దొంగలెవరో తేల్చండి. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి వివరాలు వెల్లడించడంలో మీరెందుకు వెనక్కి తగ్గారు. దీని వెనుక ఏమైనా మతలబు దాగి ఉన్నదా. బ్యాంకులు సమాజంలో భాగం కావా. ప్రజలు కష్టపడి డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వాటిని నియంత్రించే అధికారం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఉంది. కాదనలేం. కానీ ఎవరు రుణాలు తీసుకున్నారు..ఎవరు రుణాలు చెల్లించడం లేదో ..ఆ వివరాలను ఎందుకు వెల్లించడం లేదు. ఏ వ్యవస్థ అయినా సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందన్న విషయం గుర్తుంచు కోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకు సంబంధం లేదంటూ పేర్కొంటే..తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకులకు కస్టోడియన్‌గా ఉన్న ఆర్బీఐ స్వతంత్ర వ్యవస్థలో లేదని తెలిపింది. ఆర్టీఐ కింద బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందేనంటూ మరోసారి హెచ్చరించింది.
ఇందుకు సంబంధించిన ఆర్బీఐ తన విధి విధానాలను పునః సమీక్షించు కోవాలని జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. చట్ట ప్రకారం ఆ వివరాలను వెల్లడించాల్సిందేనని..గోప్యత అంటూ ఉండరాదని స్పష్టం చేసింది. పారదర్శకత చట్టాల్లోని ప్రొవిజన్స్‌ను అమలు చేసేందుకు ఆర్బీఐకి ఆఖరు అవకాశం ఇస్తున్నామని ..పేర్కొంది. అందుకే కోర్టు ధిక్కారణ ప్రొసీడింగ్స్‌ను ఇవ్వడం లేదని బెంచ్ తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని ఇచ్చేందుకు ఆర్బీఐ తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమంటూ స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్టు తేలితే ..ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆర్టీఐ కింద బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికను వెల్లడించేందుకు ఆర్బీఐ నిరాకరించడంతో ఈ ఏడాది జనవరిలో అత్యున్నత న్యాయస్థానం మరోసారి హెచ్చరించినంత పనిచేసింది.
పారదర్శకత చట్టం కింద సమాచారాన్ని అడిగితే ..ఆర్బీఐ ఇవ్వడం లేదంటూ ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిమానాలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే.. చట్టాలకు లోబడే తాము విధులు నిర్వర్తిస్తున్నామని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ సూపర్‌విజన్, కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ సూపర్‌విజన్, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్స్‌కు ఈ సమాచారంపై పూర్తి హక్కులు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో ఇలాంటి తరహా సమచారాన్ని వెల్లడి చేయకుండా పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని తెలిపింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం వీటికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని, సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగితే ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి