26 ఏళ్లలో 11 రూపాయల పెట్టుబడి 54 వేల రాబడి - వన్నె తగ్గని ఎంఆర్ఎఫ్..!

డబ్బులు ఊరికే రావు. ఇటీవల తెలుగు వారి లోగిళ్ళలో బాగా పాపులర్ అయిన యాడ్. మార్కెట్ లో లెక్కలేనన్ని రూపాయలు ఉన్నాయి. కాకపోతే వాటిని ఎలా పొందాలో, ఎలా మన జేబుల్లోకి రావాలో ప్రయత్నం చేయాలి. కష్టపడాలి. సాధించాలి. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే భయం. అపోహ కూడా. కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఆధారంగా తోచినంత డబ్బులను షేర్స్ రూపంలో పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతే కొన్నేళ్లలో మీరు లక్షాధికారి కావొచ్చు. ఏ రంగం లోనైనా పర్ఫెక్ట్ గా సక్సెస్ కావాలంటే ఒకే రంగం మీద దృష్టి సారించాలి. బతకాలంటే మనీ ఉండాలిగా. అందుకే రూపీస్ కు , డాలర్లకు అంత డిమాండ్. ప్రతి ఒక్కరు దాని వెంట పరుగులు తీయడమే. ఇదే స్టాక్ మార్కెట్ ను నమ్ముకున్న వాళ్ళు కరోడ్ పతులయ్యారు. కోట్లాది మంది బికారులుగా మారినసందర్భాలు కోకొల్లలు. కళ్ల ముందు జరిగిన వాస్తవం ఏమిటంటే ఐటీ రంగంలో సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో దాని చైర్మన్ రామలింగ రాజు చేసిన తప్పిదాలకు అరెస్ట్ కావడంతో వేళల్లో ఉన్న షేర్స్ ఒక్క సరిగా పడి పోయాయి. అదే సమయంలో దానిని టేకోవర్ చేసుకునేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. కా...