దిగ్గజ కంపెనీల మధ్య వార్..!
టెక్నాలజీ మారుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇతర కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో టెక్నీకల్ ఎక్స్ పర్ట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే యాపిల్, శ్యాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీటి ఆధిపత్యానికి చైనా కంపెనీలు గండి కొడుతున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఉండేలా మొబైల్స్ తయారు చేయడంతో కొనుగోలుదారులు వీటిపైనే మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఆసియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ వాటా కలిగిన ఇండియాలో ఇప్పుడు చైనా మొబైల్స్ షేక్ చేస్తున్నాయి. వీటి దెబ్బకు బడా కంపెనీలు అబ్బా అంటున్నాయి. తాజా అంచనాల ప్రకారం షావోమి మొబైల్స్ భారీ ఎత్తున అమ్ముడు పోయాయంటే అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇండియన్ కు చెందిన మనోజ్ కుమార్ జైన్ ఇండియా హెడ్ గా బాధ్యతలు చేపట్టాక మొత్తం స్ట్రాటజీని మార్చేశాడు. గ్రామాలకు సైతం మొబైల్స్, యాక్ససరీస్ అందుబాటులో ఉండేలా చేశాడు. దీంతో సామాన్యులు ఈ కంపెనీ మొబైల్స్ కు కనెక్ట్ అయ్యారు. మార్కెట్లో నిలబడాలంటే ధరల్లో మార్పులు, గిఫ్ట్స్ ఇవ్వడం, మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాయి మిగతా మొబైల్స్ కంపెనీస్. తాజాగా ఇదే చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు లెనోవా సొంతమైన మోటరోలా భారత మార్కెట్‌లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్‌ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్ టీవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో స్మార్ట్ టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహంతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది.
షావోమి ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది. మరోవైపు షావోమి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మార్కెట్ లోకి ఎన్ని కంపెనీలు వచ్చినా, తమ మార్కెట్ ను ఏ మాత్రం ప్రభావితం చేయలేవంటున్నారు కంపెనీ బాధ్యులు. ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని స్మార్ట్ టీవీ మోడల్స్ ను వినియోగదాదులు ఎక్కువగా కొనుగోలు చేశారని, అందుకే కొత్తగా మరో 65 అంగుళాల టీవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్ 9 ఆధారంగా, గేమింగ్ కంట్రోలర్ సపోర్ట్‌తో పని చేసేలా తయారు చేశారు. స్క్రీన్ షిఫ్ట్, ఆటోటూన్ఎక్స్ డిస్ప్లే టెక్నాల. జీ10 బిట్ కలర్ డెప్త్ లాంటి ఫీచర్లు జోడించింది. 49, 55 అంగుళాల టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, మాలి-450 జిపియు, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 32, 43-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి. మొత్తం మీద మోటరోలా, షావో మీ ల మధ్య వార్ మొదలైనట్లే. కొనుగోలుదారులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సి ఉంటుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి