క్రికెట్ ముగిసింది..కర్నాటక మిగిలింది..!

దేశ రాజకీయాలు ఇపుడు కన్నడ రాజకీయం చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఉంటుందా..ఊడిపోతుందో తెలియక కన్నడిగులు ఉత్కంఠకు లోనవుతున్నారు. ఓ వైపు 45 రోజుల పాటు టెన్షన్ కు గురి చేసిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఇక కర్నాటకలో వేడి మొదలైంది. సభలో సమర సన్నాహాలు జరగనున్నాయి. విశ్వాస పరీక్ష నిర్వహించి తీరాల్సిందేనని యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరో వైపు తగినంత బలం లేక పోయినా సీఎం నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. మరో వైపు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. ముంబయిలో బస చేసిన కాంగ్రెస్ రెబల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. అయినా ఒకరు తప్ప మరికొందరు తన లైన్లోకి రాలేదు. విశ్వాస పరీక్షలో తమ వైపు ఓటు వేయక పోతే..శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారంటూ హెచ్చరించారు. తమ రాజీనామాలు తక్షణమే ఆమోదించాలని కోరుతూ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధంగా తాను ఎన్నికైనందున, సరై...