చరిత్ర సృష్టించిన మోదీ సర్కార్ ..పక్కా ప్లాన్..బిల్లులు పాస్ ..!

ప్రభుత్వాన్ని నడపడమంటే వంట చేసినంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు..ఇంకెన్నో ఆరోపణలు..విమర్శలు. విపక్షాల అడ్డంకులను తట్టుకుని ..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వత్తిళ్లను దాటుకుంటూ సర్కార్‌ను నడపాలంటే చాలా ఓపిక కలిగి ఉండాలి. బీజేపికి చెందిన నరేంద్ర మోదీ ఎప్పుడైతే కేంద్రంలో కొలువు తీరారో అప్పటి నుంచి ఇండియాలో మోదీ జపం వినిపిస్తోంది. ఓ వైపు రాం దేవ్ బాబా..మరో వైపు మోదీ..అమిత్ షాలు ఒక్కసారి ప్లాన్ గీశారంటే ఇక వర్కవుట్ కావాల్సిందే. తాజాగా కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టారు. మోదీ కాలు మోపడం, ఆ తర్వాత అమిత్ షా ఎంటర్ కావడం..దాని వెనుక పరిణామాలు చకా చకా మారి పోవడం షరా మామూలై పోయింది. ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వారికి తెర వెనుక జరిగే మంత్రాంగం గురించి తెలిసే వుంటుంది. రాబోయే 2020 నాటికి బీజేపీ మాత్రమే ఉండాలన్నది వీరిద్దరి ప్లాన్. అందులో భాగంగానే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు , పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు మోదీ అండ్ షా. బిల్లులు ఆమోదం పొందాలంటే అధికార పక్షం ఉంటే సరిపోదు, దానికి కా...