చిల్డ్రన్స్ మీడియా బ్రాండ్‌ను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్

వీడియా ఫార్మాట్‌లో ఇంటర్నెట్‌లో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన చిల్డ్రన్స్ మీడియా బ్రాండ్ స్టోరీ బోట్స్ ను కొనుగోలు చేసింది. భారీ ఆఫర్ ప్రకటించింది. స్టోరీ బోట్స్ ను గ్రెగ్ , ఎవాన్ స్పిరిడెల్లీస్ స్థాపించారు. సిరీస్, షార్ట్ స్టోరీస్ ను వీరు రూపొందిస్తున్నారు. ఎవ్వరి సహకారం లేకుండానే చిన్న పిల్లలే టార్గెట్‌గా ఒరిజినల్ కంటెంట్‌ను డెవలప్ చేస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రచారం పొందిందీ ఈ కంపెనీ. స్టోరీ బోట్స్ ను కొనుగోలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా తమకు యాడ్ అవుతారని..అది మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేలా చేస్తుందని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం భావించింది. భారీ కొనుగోలు తర్వాత నెట్ ఫ్లిక్స్ స్టోరీ బోట్స్ కంపెనీగా మారింది. స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో స్టోరీ బోట్స్ ప్రథమ స్థానంలో ఉంది. ఇంటర్నెట్‌లో వాల్ట్ డిస్నీ కంపెనీతో పోటీ పడుతోంది. నవంబర్ నుంచి కొత్త ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో తన వాటాను పెంచు కోవడంలో భాగంగానే నెట్ ఫ్లిక్స్ ఈ డీల్‌కు ఓకే చెప్పింది. మరో వైపు డ...