చిల్డ్రన్స్ మీడియా బ్రాండ్‌ను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్
వీడియా ఫార్మాట్‌లో ఇంటర్నెట్‌లో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన చిల్డ్రన్స్ మీడియా బ్రాండ్ స్టోరీ బోట్స్ ను కొనుగోలు చేసింది. భారీ ఆఫర్ ప్రకటించింది. స్టోరీ బోట్స్ ను గ్రెగ్ , ఎవాన్ స్పిరిడెల్లీస్ స్థాపించారు. సిరీస్, షార్ట్ స్టోరీస్ ను వీరు రూపొందిస్తున్నారు. ఎవ్వరి సహకారం లేకుండానే చిన్న పిల్లలే టార్గెట్‌గా ఒరిజినల్ కంటెంట్‌ను డెవలప్ చేస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రచారం పొందిందీ ఈ కంపెనీ. స్టోరీ బోట్స్ ను కొనుగోలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా తమకు యాడ్ అవుతారని..అది మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేలా చేస్తుందని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం భావించింది. భారీ కొనుగోలు తర్వాత నెట్ ఫ్లిక్స్ స్టోరీ బోట్స్ కంపెనీగా మారింది.
స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో స్టోరీ బోట్స్ ప్రథమ స్థానంలో ఉంది. ఇంటర్నెట్‌లో వాల్ట్ డిస్నీ కంపెనీతో పోటీ పడుతోంది. నవంబర్ నుంచి కొత్త ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో తన వాటాను పెంచు కోవడంలో భాగంగానే నెట్ ఫ్లిక్స్ ఈ డీల్‌కు ఓకే చెప్పింది. మరో వైపు డిస్నీ మూవీస్, షోస్, మార్వెల్, పిక్సార్, స్టార్ వార్స్ ఫ్రాంచైజీలను ఆన్ లైన్ ద్వారా సమకూరుస్తోంది. దీంతో నెట్ ఫ్లిక్స్ పేరెంట్స్, పిల్లలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఆస్క్ ద స్టోరీ బోట్స్ పేరుతో న్యూ ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేసే పనిలో పడింది. పూర్తిగా యానిమేషన్ తరహాలో కేరక్టర్స్ ను డెవలప్ చేస్తోంది. వాట్ మేక్స్ ఏ బర్డ్ ఏ బర్డ్, వాట్ ఆర్ గుడ్ కార్బోహైడ్రేట్స్ పేరుతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసింది.
నెట్ ఫ్లిక్స్, వాల్ డిస్నీ రెండూ నువ్వా నేనా అన్న రీతిలో మార్కెట్‌లో వాటా స్వంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఫ్యామిలీపై ఎక్కువగా ఫోకస్ పెడితే..డిస్నీ మాత్రం ప్లాన్స్ పేరుతో షేర్ చేస్తోంది. హాటర్, ఆపిల్ ఇంక్, ఏటీ అండ్ టి ఇంక్, కామ్ కాస్ట్ కార్పొరేషన్ కంపెనీలు కూడా నెట్ ఫ్లిక్స్ తో పోటీ పడుతున్నాయి. టీవీ వ్యూవర్ షిప్ పెంచుకునేందుకు స్ట్రీమింగ్ సర్వీసెస్ ద్వారా టార్గెట్ చేస్తున్నాయి ఈ రెండు దిగ్గజ కంపెనీలు. కేబుల్ వ్యూవర్స్ ను తమ వైపు తిప్పుకునేందుకు వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ ఫామ్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి.
కాలిఫోర్నియాలోని లాస్ గాటోస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నెట్ ఫ్లిక్స్ కు పెయిడ్ సబ్ స్క్రైబర్స్ 148 మిలియన్ జనాలు ఉన్నారు. ఇది కూడా ఓ రికార్డు. 7 బిలియన్ల ఆదాయాన్ని గడించింది నెట్ ఫ్లిక్స్ ఓన్లీ ప్రోగ్రామ్స్ ద్వారా. 80 శాతం వాటాను చేజిక్కించుకుంది. యూరప్, లాటిన్ అమెరికా, ఏసియా ప్రాంతాల్లో నెట్ ఫ్లిక్స్ తన హవాను కొనసాగిస్తోంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ డాలర్లను గడిస్తోంది. మరో వైపు గ్రెగ్, ఎవాన్ లు రూపొందించిన వైరల్ వీడియో మేకర్ జిబ్‌జాబ్ ఇంక్ ను కాటాపుల్ట్ కేపిటల్ ఎల్ఎల్‌సీ కంపెనీకి అమ్మేశారు. మొత్తం మీద స్ట్రీమింగ్ సర్వీసెస్ లో నెట్ ఫ్లిక్స్ తన హవాను కొనసాగిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి