పోస్ట్‌లు

సెప్టెంబర్ 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టాప్ స్టార్ట్అప్ లు ఇవే - లిస్ట్ ప్రకటించిన లింక్డ్ ఇన్ - ఓయో నే నంబర్ వన్

చిత్రం
సోషల్ మీడియాలో ప్రపంచంలో టాప్ పొజిషన్ లో ఉన్న లింక్డ్ ఇన్ కంపెనీ తాజాగా భారత దేశంలో విజయవంతగా నడుస్తున్న స్టార్ట్ అప్ ల జాబితాను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఎన్నో అంకుర సంస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట స్టార్ట్ అప్ స్టార్ట్ అవుతూనే ఉన్నది. అయితే వేలాది అంకుర సంస్థల్లో వడపోసి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వాటిలో 25 స్టార్ట్ అప్ లను వెల్లడించింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా , ఫ్రాన్స్ , జెర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ , నెదర్లాండ్స్ దేశాల్లో కూడా టాప్ స్టార్ట్ అప్ ల లిస్ట్ ప్రకటించింది. ఇక ఇండియా వరకు వస్తే, మొదటి స్థానంలో రితీష్ అగర్వాల్ తన ఐడియాతో ప్రపంచాన్నిషేక్ చేసిన ఓయో కంపెనీ నిలిచింది. గూర్గావ్ కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోంది. హోటల్ పరిశ్రమల్లో అద్దె ప్రాతిపదికన చేస్తున్న దీని వ్యాపారం ప్రపంచంలోని కొన్ని దేశాలకు విస్తరించింది. ఇండియాతో వైరం కలిగిన చైనాలో అత్త్యధిక హోటల్స్ ను ఓన్ చేసుకున్న ఒకే ఒక్క కంపెనీ ఓయో ఒక్కటే. దీని ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. హోటల్ యజమానులకు గణనీయంగా ఆదాయం సమకూరుతోంది. హోటల్స్ అండ్ హోమ్ హాస్పిటాలిటీలో ఓయో ప్రథమ స్థానం...