దిగ్గజ కంపెనీల నోట..దేశీ బాట

ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో పేరొందిన దిగ్గజ కంపెనీలన్నీ స్వదేశీ జపం చేస్తున్నాయి. ఎందుకంటే తమ దేశపు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తుల కంటే లోకల్‌గా తయారయ్యే వాటిపైనే మనోళ్లు మక్కువ కనబరుస్తుండడంతో దిగి రాక తప్పడం లేదు. ఏకంగా ఈ -కామర్స్ @ మేడిన్ ఇండియా అన్న రీతిలో పాపులర్ అయి పోయాయి. దేశీయంగానే తయారీపై దృష్టి పెడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కోసం బరిలో ఉన్న ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు దేశీయ జపం చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నాయి. లాజిష్టిక్ రంగంతో పాటు టెక్నాలజీతో అనుసంధానం కావడం, డిజిటల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతోంది. దీంతో ఇంటర్నల్‌గా కొన్ని వేల మంది ఈ రెండు కంపెనీలలో చేరిపోతున్నారు. మరో వైపు భారీగా దిగుమతి సుంకాల బెడద నుంచి తప్పించుకునేందుకు ..కేంద్ర బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ కామర్స్ దిగ్గజ కంపెన...