దిగ్గ‌జ కంపెనీల నోట‌..దేశీ బాట

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కామ‌ర్స్ రంగంలో పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ స్వ‌దేశీ జ‌పం చేస్తున్నాయి. ఎందుకంటే త‌మ దేశపు సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించే ఉత్ప‌త్తుల కంటే లోక‌ల్‌గా త‌యార‌య్యే వాటిపైనే మ‌నోళ్లు మ‌క్కువ క‌న‌బ‌రుస్తుండ‌డంతో దిగి రాక త‌ప్పడం లేదు. ఏకంగా ఈ -కామ‌ర్స్ @ మేడిన్‌ ఇండియా అన్న రీతిలో పాపుల‌ర్ అయి పోయాయి. దేశీయంగానే త‌యారీపై దృష్టి పెడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న నిరుద్యోగుల‌కు కొంత మేర ఉపాధి ల‌భించ‌నుంది. ఇప్ప‌టికే ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కోసం బ‌రిలో ఉన్న ఈ కామ‌ర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు దేశీయ జ‌పం చేస్తున్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు నానా పాట్లు ప‌డుతున్నాయి. లాజిష్టిక్ రంగంతో పాటు టెక్నాల‌జీతో అనుసంధానం కావ‌డం, డిజిట‌ల్ టెక్నాల‌జీని అడాప్ట్ చేసుకోవ‌డం జ‌రుగుతోంది. దీంతో ఇంట‌ర్న‌ల్‌గా కొన్ని వేల మంది ఈ రెండు కంపెనీలలో చేరిపోతున్నారు.

మ‌రో వైపు భారీగా దిగుమ‌తి సుంకాల బెడ‌ద నుంచి త‌ప్పించుకునేందుకు ..కేంద్ర బీజేపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన మేకిన్ ఇండియా నినాద ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీలు క్ర‌మంగా ఇండియాను ఎంచుకుంటున్నాయి. ఇప్ప‌టి దాకా స్వంత బ్రాండ్స్ కోసం చైనా, మ‌లేషియా దేశాల‌పై ఎక్కువ‌గా ఆధార ప‌డుతూ వ‌స్తున్న ఫ్లిప్ కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్ప‌త్తుల వైపు మొగ్గు చూపుతోంది. దీంతో త‌మ ప్లాట్ ఫాంపై విక్ర‌యించే దాదాపు 300 కేట‌గిరీల ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ గ‌లిగామ‌ని కంపెనీ యాజ‌మాన్యం వెల్ల‌డించింది. రెండేళ్ల కింద‌ట 100 శాతానికి పైగా ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల ఉత్ప‌త్తులు చైనా నుంచి వ‌చ్చేవి. ప్ర‌స్తుతం 50 శాతానికి పైగా త‌గ్గి పోయాయి. ఫ‌ర్నీచ‌ర్ బ్రాండ్ ను ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు పూర్తిగా మ‌లేషియా దేశంపై ఆధార‌ప‌డేది. ఇది కూడా త‌గ్గించు కోవ‌డం జ‌రిగింద‌ని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

ఈ కంపెనీ నుంచి మార్ క్యూ, ప‌ర్ఫెక్ట్ హోమ్స్, బిలియ‌న్, స్మార్ట్ బై త‌దిత‌ర ప్రైవేట్ బాండ్స్ ను విక్ర‌యిస్తోంది. ఇవి కంపెనీ అమ్మ‌కాల్లో 8 శాతంగా ఉంటాయి. ఎక్కువ‌గా ఎల‌క్ట్రానిక్ క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్, టెక్స్ టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీష‌న‌ర్స్ , వాషింగ్ మెషీన్స్ , చిన్న స్థాయి ఉప‌క‌రణాలు త‌దిత‌రాలు దేశీయంగా నే ఉండేలా చేస్తోంది. 50 నుంచి 60 శాతం ఇక్క‌డి నుంచే ల‌భించేలా ఉండ‌డంతో కంపెనీకి ప్ర‌యోజ‌నాలు కూడా ద‌క్కుతున్నాయి.
అంత‌ర్జాతీయంగా పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇండియాకు రావాల‌ని, ఇక్క‌డే త‌యారీ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీజి పిలుపునిచ్చారు. ఈకామ‌ర్స్ కంపెనీల దెబ్బ‌కు త‌మ వ్యాపార‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని, త‌మ‌కు బ‌తుకు దెరువు లేకుండా పోతోంద‌ని ల‌క్ష‌లాది మంది చిరు వ్యాపారులు ల‌బోదిబోమంటున్నారు. వారికి మ‌రింత భ‌రోసా ఇచ్చేలా బీజేపీ స‌ర్కార్ ఆలోచిస్తే మంచిది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!