అరుదైన అవకాశం..పృథ్వీకి దక్కిన గౌరవం - ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా బాల్ రెడ్డి
జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించు కోవాలని అనుకుంటారు కోట్లాది మంది ప్రజలు. కొండపై వెలసిన ఆ శ్రీ వేంకటేశ్వరుడిని పావనం చేసుకుంటే జన్మ ధన్యమైనట్టేనని భావించే వారిలో కోటాను కోట్లున్నారు. దీనికంతటి ఆ శ్రీనివాసుడి మహిమనే తప్ప మరోటి కాదు. ఆ కొండపై సేవ చేసే భాగ్యం లభిస్తే చాలని అనుకునే భక్తులు ఎందరో. అదృష్టం వుంటే తప్ప రాదంటారు వినమ్రంగా కొందరు. స్వామి వారి సన్నిధిలో అత్యున్నతమైన పదవి లభిస్తే ..ఇంక అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉంటుందంటారా చెప్పండి.
ఆ స్వామి, అమ్మ వార్ల గురించి, తిరుమల దేవాలయం గురించి ప్రతి రోజూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకట్వేశర భక్తి ఛానల్ నిరంతరాయంగా ప్రసారాలను అందజేస్తోంది. ఈ ఒక్క ఛానల్‌ను రోజుకు కోటి మందికి పైగా చూస్తున్నారు. దాని రేటింగే వేరు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తులు అందజేస్తున్న విరాళాలతో కొన్నేళ్లుగా నడుస్తూనే వుంది.
ప్రత్యక్ష ప్రసారాలు, స్వామి వారికి సమర్పించే కైంకర్యాలు, విశిష్ట పూజలతో పాటు రోజూ విడతల వారీగా జరిగే కార్యక్రమాల గురించి టెలికాస్ట్ చేస్తోంది ఈ ఛానల్. వీఐపీలు సందర్శించినా..ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఈ ఛానల్ తన పరిధిని దాటి ప్రసారం చేయలేదు. ఇక్కడంతా సమానులే. భక్తులకే పెద్దపీట..స్వామి, అమ్మవార్లకు చెందిన కార్యక్రమాలకే పెద్దపీట. ఇక్కడ వ్యక్తులకు , వ్యవస్థలకు చోటు అంటూ ఉండదు.
అందుకే కొన్నేళ్ల పాటు ఎలాంటి ఒడిదుడులకు లోనుకాకుండా విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఆ స్వామి అనుగ్రహం ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ కింగ్ మేకర్ ..30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ డైలాగ్ తో అభిమానులను సంపాదించుకున్న పృథ్వీ అలియాస్ బాల్ రెడ్డి పృథ్వీకి దక్కింది. ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను శ్రీ వేంకట్వర భక్తి ఛానల్‌కు ఛైర్మన్‌గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా సీఎంకు వెన్నంటి ఉన్నారు ఈ కమెడియన్.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రచార కమిటీకి బాధ్యతలు వహించారు. ఎక్కడ చూసినా జగన్ ను స్మరించుకునేలా ప్రింట్, మీడియా, సోషల్ మీడియాలో మరింత ప్రచారం వచ్చేలా కృషి చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరాక అందరూ పృథ్వీకి ఏపీ నాటక అకాడెమీ ఛైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. ఆ మేరకు ఆయన పేరు పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఎస్వీ సుబ్బారెడ్డిని ఛానల్‌కు ఛైర్మన్‌గా జగన్ నియమించారు.
అంతకు ముందు టిటీడీ ఛైర్మన్‌గా పదవి కట్టబెట్టారు. దీంతో లాభాదాయక పదవిలో ఉండరాదనే నిబంధన ఉండడంతో పృథ్వీని శాశ్వత ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు జగన్. కష్టపడితే..తనను నమ్ముకుంటే ఏ స్థాయిలో ఉన్నా సరే..తప్పక న్యాయం చేస్తానన్న తన మాటలను నిజం చేశారు..సీఎం. సో..బాల్‌రెడ్డి పృథ్వీ గారు..మాటలతో నవ్వులు పూయించటమే కాదు ..హాస్యరసాన్ని పండించడంలో మీకు మీరే బాస్. ఇలాగే మీరు నవ్వుతూ ఉండాలి. ఎస్వీబీసీ ఛానల్ కు మీరు ఛైర్మన్ పదవిని పొందడం..స్వామి వారి ఆశీస్సులు ఉండటమే. మీజీవితం ధన్యం. మీ జన్మకు ఇది చాలు. ఇంకేమీ అక్కర్లేదు పృథ్వీ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి