బైజూకు భారీ ఆదాయం - స్టార్టప్‌లో నెంబర్ వన్

ఏదో సరదా కోసం ఏర్పాటైన బైజూ స్టార్టప్ కంపెనీ ఇవాళ భారీ ఆదాయాన్ని వెనకేసుకుంటోంది. ఐడియాలు వుంటే చాలదు..వాటిని సమయానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటే కోట్లాది రూపాయలు మన చెంతకు చేరుకుంటాయన్న దానికి బైజూ ఒక్కటే ఉదాహరణ. 2018 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బైజూ రెవిన్యూ పరంగా తన ఆదాయాన్ని అంచనాలకు మించి పెంచుకుంది. ఒకటి కాదు ఏకంగా 490 కోట్లను కొల్లగొట్టింది. ఇది ఇండియన్ అంకుర సంస్థల్లో ఒక రికార్డుగా భావించాలి. 2019 ఏప్రిల్ నెలనాటికి చూసుకుంటే..బైజూకు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ దక్కింది. దీంతో యాడ్ రెవిన్యూ కూడా పెరిగింది. నెల నెలా ఆదాయం 200 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి బైజూ దగ్గర రమారమి 3000 వేల కోట్ల రూపాయలు ఉంటాయన్నది ట్రేడ్ వర్గాల అంచనా. బెంగళూరు కేంద్రంగా బైజూ ఆన్ లైన్ ట్యూటర్ సంస్థగా ప్రారంభమైంది. ఈ సంస్థ తయారు చేసిన యాప్ కొద్ది సమయంలోనే మిలియన్ల సబ్ స్క్రైబర్స్‌ను స్వంతం చేసుకుంది. మార్చి 2019 నాటికి బైజూ వాస్తవిక రెవిన్యూ 1430 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదనంగా 2018లో 430 కోట్ల ఆదాయం సమ...