సుందర్ పిచాయ్‌కు అరుదైన పురస్కారం
ఇండియాకు చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే ఆయన ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందారు. టెక్కీ దిగ్గజంగా మన్ననలు అందుకున్నారు. సాంకేతిక పరంగా అత్యున్నతమైన ..టెక్కీ దిగ్గజ కంపెనీకి ఈ భారతీయుడు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్విహిస్తున్నారు. గూగుల్ ను నమ్మకమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు తెర లేపారు. మరో వైపు మైక్రోసాఫ్ట్ కు తెలుగు వాడైన నాదెళ్ల సిఇఓగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా సెర్చింగ్ సైట్స్‌లలో గూగుల్ టాప్ పొజిషన్‌లో ఉంటోంది. దీనికంతటికి కారణం మనోడే. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఈ టెక్కీ దిగ్గజం ఏది చేసినా..ఏది మాట్లాడినా ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో వైరల్ అవుతోంది.
రోజు రోజుకు గూగుల్‌కు కొత్త సొబగులు అద్దుతూ సామాజిక పరంగా, సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేయడంలో నిమగ్నమవుతున్నారు సుందర్ పిచాయ్. కోట్లాది మంది యువతీ యువకులకు ఈ సిఇఓ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. లక్షలాది మంది అమెరికన్ గూగుల్ కంపెనీకి సిఇఓ కావాలని పోటీ పడ్డారు. కానీ చెన్నైయికి చెందిన తమిళ తంబి దెబ్బకు ఏ ఒక్కరు నిలువలేక పోయారు. ఏడాదికి 1000 కోట్ల దాకా వేతనం అందుకుంటున్న ఒకే ఒక్క టెక్కీ ఇతడే అంటే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా అదనపు సౌకర్యాల కింద సంస్థ యాజమాన్యం సుందర్‌కు 405 కోట్లు ఆఫర్ చేసింది. ఇంతటి భారీ ఆఫర్ ను సదరు సిఇఓ తనకు అవసరం లేదని తెలిపారు. తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సంస్థ సామాజికాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు.
గూగుల్ ను నెంబర్ వన్ గా నిలపడంలో కృషి చేస్తున్న సిఇఓ సుందర్ కు అమెరికా భారత వాణిజక్య మండలి ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును 2019 సంవత్సరానికి గాను ఎంపిక చేసింది. ఆయనతో పాటు నాస్ డాక్ సిఇఓ అడేనా ప్రైడ్ మాన్‌ను ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధికి ఇరు కంపెనీలు ఇతోధికంగా సేవలు అందిస్తున్నాయని యుఎస్ ఐబీసీ వెల్లడించింది. వారందిస్తున్న సేవలకు గాను గుర్తింపుగా ఈ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు తెలిపింది.
త్వరలో జరగబోయే ఇండియా ఐడియాస్ సదస్సులో వీరిరువురికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గూగుల్, నాస్ డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా - ఇండియా మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150 శాతానికి పైగా వృద్ధి చెందినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ వృద్ధికి భారత్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందన్నారు. ఈ క్రమంలో జరగిన సాంకేతిక అభివృద్ధితో ప్రజల జీవన విధానం బలపడిందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి