స‌క్సెస్ బాట‌లో మిల్క్ బాస్కెట్ స్టార్ట‌ప్

కేంద్రంలో మోదీ స‌ర్కార్ కొలువు తీరాక‌..ఐటీ రంగానికి మ‌రింత ఊతం ల‌భించిన‌ట్ల‌యింది. మేకిన్ ఇండియా పేరుతో..స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హించ‌డం ..ఏకంగా వాటికి ప్ర‌త్యేకంగా ఫండింగ్ ఇచ్చేందుకు సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డంతో డిఫ‌రెంట్ ఐడియాస్‌తో కొలువుతీరుతున్నాయి స్టార్ట‌ప్‌లు. ఓ వైపు బెంగ‌ళూరు మ‌రో వైపు హైద‌రాబాద్ తో పాటు హ‌ర్యానా, ఢిల్లీ, ముంబ‌యి , చెన్నై న‌గ‌రాలు పోటీ ప‌డుతున్నాయి. సాంకేతికంగా ప‌లు మార్పులు చోటు చేసుకోవ‌డంతో ఆ దిశ‌గా ఎక్కువ‌గా స్టార్ట‌ప్‌లు వ‌స్తున్నాయి. కొన్ని ప్రారంభంలోనే చ‌తికిల ప‌డుతుంటే మ‌రికొన్ని లాభాల బాట‌ల ప‌య‌నిస్తున్నాయి.

ఢిల్లీ , త‌దిత‌ర న‌గ‌రాలకు విస్త‌రించింది మిల్క్ బాస్కెట్. దీనికి అనంత్ గోయ‌ల్ కో ఫౌండ‌ర్‌గా ఉన్నారు. మిల్క్ తో పాటు మిల్క్ రిలేటెడ్ ప్రాడ‌క్ట్స్ ను అంద‌జేస్తుంది ఈ సంస్థ‌. దేశంలోని నాలుగు న‌గ‌రాల‌లో మిల్క్ బాస్కెట్‌ను లాంఛింగ్ చేశారు. గ‌త ఆరు నెల‌ల కాలంలోనే మ‌రింత విస్త‌రించింది. వ్యాపార ప‌రంగా మంచి ఆదాయం స‌మ‌కూరుతోంది. దీంతో మ‌రికొన్ని సిటీస్ లోకి ఎంట‌ర్ కావాల‌న్న‌ది త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా గోయ‌ల్ వెల్ల‌డించారు. వ్యాపార విస్త‌ర‌ణ కోసం గాను 180 కోట్లు వ‌సూలు చేయాల‌న్న‌ది వీరి ఆలోచ‌న‌. ఇప్ప‌టికే పేరొందిన కంపెనీల‌న్నీ దీనిపై దృష్టి పెట్టాయి.

యూనిలివ‌ర్ వెంఛ‌ర్స్ తో పాటు మేఫీల్డ్ ఇండియా, క‌లారై కేపిట‌ల్ , బ్లూమే వెంఛ‌ర్స్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ మిల్క్ బాస్కెట్ లో పెట్టుబ‌డులు పెట్టాయి. ఇవ‌న్నీ క‌లిపి 10.5 మిలియ‌న్స్ ఇన్వెస్ట్ చేశాయి. అంటే ఇండియ‌న్ రూపీస్‌లో చూసుకుంటే 72.73 కోట్లు అన్న‌మాట‌. ఇంకా 100 కోట్లు స‌మీక‌రించాల్సి ఉంది. మాకు మా ప‌నితీరు మీద న‌మ్మ‌కం ఉంది. మేం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాం. మార్కెట్‌లో మా కంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాం.

భ‌విష్య‌త్‌లో ఈ నిధుల‌ను రాబ‌ట్ట‌డం అనేది క‌ష్ట‌మ‌వుతుంద‌ని అనుకోవ‌డం లేదంటున్నారు నిర్వాహ‌కులు. 70 శాతం రెవిన్యూ మిల్క్ సంబంధిత ప్రాడ‌క్ట్స్ మీద‌నే త‌మ‌కు ల‌బిస్తోందంటున్నారు. 8 వేల 500 మిల్క్ బాస్కెట్ స్టాక్ పాయింట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఒక బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం 2021 వ‌ర‌కు చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది మిల్క్ బాస్కెట్. 2015లో దీనిని ప్రారంభించారు. ఇపుడు లాభాల బాట ప‌ట్టింది.

కామెంట్‌లు