జాక్ పాట్ కొట్టేసిన స్విగ్గీ - భారీ ఆఫర్ ప్రకటించిన సాఫ్ట్ బ్యాంక్
ఇండియాలో ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మరింత పాపులర్ గా నిలిచిన స్టార్టప్ కంపెనీ స్విగ్గీకి బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా జాక్ పాట్ కొట్టేసింది. జపనీస్ దిగ్గజ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ 300 నుండి 500 మిలియన్ డాలర్లను స్విగ్గీలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఫుడ్ ఇండస్ట్రీలో టెక్నికల్‌గా ఇతోధికంగా సేవలందిస్తూ అంతకంతకూ కస్టమర్ల చెంతకు చేరుతున్న స్విగ్గీ పనితీరుకు ముచ్చట పడింది ఈ జపనీస్ కంపెనీ. ఏకంగా భారీ ఎత్తున పెట్టబుడి పెట్టేందుకు రెడీ అయింది. బెంగళూరు కేంద్రంగా ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభమైంది.
ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ఇంటి ముందు డెలివరీ చేయడం స్విగ్గీ చేస్తుంది. ఐటీ పరంగా బెంగళూరు ఇండియాలో టాప్ పొజిషన్‌లో ఉంది. ఇప్పటికే ఒన్ బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది ఈ కంపెనీ. సాఫ్ట్ బ్యాంకు గ్రూపు 500 మిలియన్స్‌ను ఇన్వెస్ట్ రూపేణా అందజేయనుంది. స్విగ్గీకి జొమాటో కంపెనీ నుంచి పోటీ నెలకొంది. దీనిని అధిగమించేందుకు స్విగ్గీ నిర్వాహకులకు ఈ నిధులు మరింత ఉపయోగ పడతాయి. ఫుడ్ టెక్ బిజినెస్‌లో డైరెక్టర్‌గా ఓ విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి. ఇక స్విగ్గీ, జొమాటో కంపెనీలు రెండూ సమానంగా మార్కెట్‌లో పరుగులు తీస్తున్నాయి.
ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని చెప్పడానికి వీలు లేదు.కాకపోతే మార్కెట్ ట్రెండ్ ను బట్టి డిమాండ్ అండ్ సప్లయి మారుతుంది అంతే అంటున్నారు మార్కెట్ వర్గాలు.ఇండియన్స్‌లో ఫుడ్ పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరో వైపు ఉద్యోగ రీత్యా వంట చేసుకునేందుకు ఇబ్బందిగా మారుతోంది. ఓ వైపు పని వత్తిళ్లు, జర్నీ చేయడం, ఇంటికి వచ్చేసరికల్లా పిల్లలు, చదువులు, రిలేటివ్స్ ..ఇలా ఇంటి పట్టున ఉండలేక పోతున్నారు. వేతనాలు లక్షల్లో ఉంటున్నా..సంతృప్తి అన్నది లేకుండా పోతోంది.
దీంతో ఏదో ఒకటి చేసుకోవాలంటే ఓపిక ఉండటం లేదు..పేరెంట్స్ కు, భార్య భర్తలకు. ఇక పిల్లలు సైతం ఫాస్ట్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు.దీంతో ఆర్డర్లు ఆన్ లైన్‌లో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి.దీంతో వ్యాపారం మరింత విస్తరించేలా చేస్తోంది. స్విగ్గీ బెంగళూరులో ఇతోధికంగా సేవలందిస్తూ మన్ననలు పొందుతోంది. ఈ విషయాన్ని గమనించిన కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తం మీద చిన్న ఐడియా ఇపుడు కోట్ల రూపాయలు పొందేలా చేయడం ..నిజంగా అదృష్టమే కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి