పోస్ట్‌లు

నవంబర్ 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చిందేసిన చిరు..సందడి చేసిన ఖుష్బూ

చిత్రం
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఏది చేసినా సంచలనమే. అయన మాట్లాడినా లేదా డ్యాన్స్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అయన తెలంగాణకు చెందిన డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన సైరా నరసింహ్మ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో చిరంజీవి శక్తికి మించి నటించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. తన సినీ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా సైరా సినిమానే అంటూ స్పష్టం చేశారు ఈ మెగాస్టార్. ఇదిలా ఉండగా 1980 లో తెలుగు, తమిళ్, కన్నడ సినీ రంగానికి చెందిన నటీనటులు ఒకే చోట ప్రతి ఏడాది సమావేశం కావడం జరుగుతూ వస్తోంది. ఈ సారి స్పెషల్ గా మాంచి ఊపు మీదున్న చిరంజీవి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. మరిచిపోని జ్ఞాపకాలను మిగిల్చారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లి పోయారు. క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ రీ యూనియన్‌ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫుల్ గా ఎంజాయ్‌ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మ...

సుధా మూర్తి..నిత్య స్ఫూర్తి

చిత్రం
బుల్లితెర మీద సంచలనం సృష్టించిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి 11 వ సీజన్ ముగిసింది. ప్రముఖ నట దిగ్గజం, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. దేశాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. వ్యక్తి నుంచి వ్యవస్థగా మారడమే కాక ఏకంగా యూనివర్సిటీని స్థాపించిన సామంతను కూడా బిగ్ బి పరిచయం చేశారు. షో చివరి ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి పాల్గొన్నారు. సుధామూర్తిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానించిన బిగ్‌బీ.. వయసులో చిన్నదైనా, ఆమె కాళ్లకి నమస్కరించాడు. ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ సుధామూర్తి 60 వేల లైబ్రెరీలు, వందల స్కూళ్లు, 16 వేలకు మించిన టాయిలెట్లు కట్టించారని తెలిపారు. అనంతరం సుధామూర్తి తన నేపథ్యాన్ని వివరించారు. స్ఫూర్తిదాయకంగా,ఆదర్శ వంతంగా సాగిన ఆమె జర్నీ గురించి స్వయంగా వివరించారు. నేను ఇంజనీరింగ్‌ చదవాలని అనుకున్నప్పుడు మా తండ్రి తిరస్కరించారు. అలా చేస్తే మన కమ్యూనీటీలో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరని హెచ్చరించారు. అయినప్పటికీ నేను ఇంజనీరింగ్‌ చదివేందుకే మొగ్గు చూపాను. కర్ణా...

ప్రియాంక మరణం..సినీలోకం ఆగ్రహం

చిత్రం
వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో స్పందించారు. ఆమె హత్య తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. అల్లరి నరేశ్‌, అల్లు శిరీశ్‌, సుధీర్‌బాబు, వివి వినాయక్‌, కీర్తి సురేశ్‌, మెహ్రీన్ పిర్జాదా‌, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్‌ ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయని  , ప్రియాంక రెడ్డి హత్య తెలియ గానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పేర్కొన్నారు. తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు. ఏ సమయంలో నైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగి వచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్య చేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్ల వేళలా పని చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశార...

పని చేయని సర్కార్ మంత్రం

చిత్రం
దేశ ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన నోట్ల రద్దు మంత్రం ఏకంగా మోడీకి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని చేసిన ప్రకటనలు ఆచరణలోకి రాలేదు. నగదు లావా దేవీలు జరపడంలో బ్లాక్ మనీ ఎక్కువగా వాడుతున్నారని, వీటిని చెక్ పెట్టాలకునున్న పీఎం ఆలోచన వర్కవుట్ కాలేదు. నగదు లావాదేవీల్లో బ్లాక్‌ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన 1,000, 500 నోట్ల రద్దు  పూర్తి స్థాయిలో పట్టా లెక్క లేదు. ఈ నిర్ణయం తీసుకుని మూడేళ్లు గడిచినా, నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి.  రియల్‌ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్‌సీఆర్‌. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్‌ ప్రాపర్టీలల్లో మాత్రం క్యాషే కింగ్‌. మొత్తం ప్రాపర్టీ విలువలో 20 నుంచి 25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. బెంగళూరు, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్‌ గృహాల మార్కెట్లలో బ్లాక్‌ మనీ ద్వారానే ల...

చిన్న జీయర్ ఆశీర్వాదం..జన్మ ధన్యం

చిత్రం
ఎక్కడికో వెళ్లడం దేని కోసం. ఉన్న చోటును గుర్తించం. లేనిదాని కోసం ఆరాట పడతాం. అంతులేనిది ఏదో ఉందన్న భ్రమల్లో బతుకుతాం. ఇదే మానవుల్ని ఇబ్బందులకు లోను చేస్తోంది. అందని దాని కోసం అర్రులు చాచడం. ఎదుటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండక పోవడం, ఈర్ష్య విద్వేషాలతో అద్భుతమైన, దేవుడు ప్రసాదించిన ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఇది కాదు మన ప్రయాణం. ఇది కాదు మన సంస్కృతి. వేదాలు, ఇతిహాసాలు మనం ఎలా ఉండాలో, ఏది ఎప్పుడు చేయాలో..సమాజంలో మన బాధ్యత ఏమిటో గుర్తు చేస్తాయి. నీతి, నిబద్దత, ధర్మాన్ని గతి తప్పకుండా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇది కాదనలేని సత్యం. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎలా ప్రవహిస్తూ  వుంటాయో మీ అందరి మనస్సులో కోరికలు, ఆలోచనలు అలాగే కదులుతూ ఉంటాయి. దీనిని నిలువరించి అడ్డుకట్ట వేసే మార్గాన్ని భక్తి అనే సాధనం చేస్తుంది. దీనిని గుర్తించి సాధన చేయగలిగితే మీకు మీరుగా ఏ ఒక్కరి సహాయమూ లేకుండా మీ అంతటా మీరే గొప్ప సాధకులుగా మారే అవకాశం ఉన్నది. ఇదంతా నిరంతరం సాగే దైనందిన ప్రక్రియ. జీవన యానంలో ప్రతిదీ మనల్ని పలకరిస్తుంది. పరవశించేలా చేస్తుంది. ఇదంతా బాహ్య రూపకంగా అగుపించే సన్నివేశం. కానీ లోపట ఉండ...

దిగ్గజాల సరసన థాక్రే

చిత్రం
ఉద్దవ్ థాక్రే ఈ పేరు దేశంలో సంచలనం కలిగించింది. ఎక్కువగా వైరల్ అయిన ఒకే ఒక్క నాయకుడు ఇతడు. మోడీ, అమిత్ శాలను కాదని ఉద్దవ్ ఇప్పుడు అందివచ్చిన నాయకుడిగా, తిరుగులేని శివసేన సానికుడిగా అవతరించాడు. బాల్ థాక్రే లాగా దుందుడుకు స్వభావం లేకపోయినా ఉద్దవ్ ఠాక్రే తానేమిటో నిరూపించుకున్నాడు. కాగా విధాన్‌ సభ, విధాన పరిషత్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఎనిమిదో వ్యక్తి. ఇది వరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌ దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌ నిలంగేకర్, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, షిండే, పృథ్వీరాజ్‌ చవాన్, తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు.  నియమాల ప్రకారం ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాల వ్యవధిలో విధాన సభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్ట వశాత్తు ఇంత వరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ...

ఫోర్బ్స్‌ టాప్‌10లో మనోడు

చిత్రం
రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. అంతులేని సంపదతో రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 4.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌ పేర్కొంది. తాజాగా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10,01,555 కోట్లకు చేరి..ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే. కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో 1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్‌ సంపద అమాంతం పెరిగి పోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ, ఈసారి ఏకంగా టాప్‌10లోకి చేరి ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ ఫౌండర్, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్‌ డాల...

మరాఠా యోధుడికి పరీక్ష

చిత్రం
మరాఠా పీఠంపై కొలువు తీరిన శివ సైనికుడికి అగ్ని పరీక్ష నెలకొంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం  అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడి’ గా సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బల నిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు   గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మెజారిటీని నిరూపించు కునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సిద్ధమయ్యారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్‌ కాళిదాసు కొలాంబ్కర్‌ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్‌ పాటిల్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే  లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజ...

జగన్ కు జేజేలు..జనం నీరాజనాలు

చిత్రం
సందింటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దేశం అంతా తన వైపు చూసుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న యువ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. మాట ఇవ్వడం దానిని అమలు చేసేంత దాకా నిద్రపోని తత్వం కలిగిన ఈ దిగ్గజ నేత ఏది చేసినా అది జనం కోసమే. ప్రస్తతం ఏపీలో ఆయన హవా నడుస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకు వస్తున్నారు. ఆ మేరకు అధికారులను, తన మంత్రివర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారు. ఆరు నెలల్లో అందరితో శెభాష్ ఆనిపించు కుంటానని ఆయన సవాల్ విసిరారు. దానిని తూచ తప్పకుండా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీలో ఖాళీ ఖజానా.. గాడిలో లేని పాలన.. అన్ని రంగాల్లోనూ అవినీతి విశృంఖలత..రాజ్యం ఏలుతోంది. దానిని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకు వచ్చాడు. తొలి అడుగే సంక్షేమ సంతకం చేశారు. అన్ని వర్గాలకు ఆలంబనగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ఏ ఒక్క పథకానికీ దూరం కాకూడదన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి తరచూ చెబుతున్న...

ఏమిటీ ఘోరం..ప్రియాంకా క్షమించు

చిత్రం
సభ్య సమాజం ఇవ్వాళ దోషిగా నిలబడింది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆపై నామ రూపాలు లేకుండా శవమయ్యారు. చివరకు ఆధారాలు సైతం దక్కని రీతిలో కాల్చబడ్డారు. ఇదేదో మర్డర్ సినిమా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ లో జరిగిన దారుణమైన, అమానవీయమైన సంఘటన. నిన్న కళ్లెదుటే రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో ను కాల్చిన దుర్ఘటన మరిచి పోక ముందే, మరో దారుణం కళ్ళముందే జరగడం బాధాకరం. టెక్నాలజీ పెరిగినా, చట్టాలు ఉన్నా, లెక్కలేనంతగా పోలీసులు రక్షణగా ఉన్నా ..వేలాది వాహనాలు, భారీగా జనం నిత్యం ప్రయాణం సాగించే శంషాబాద్ ప్రాంతం ఈ మొత్తం ఘటనకు సాక్షీ భూతంగా నిలిచింది. ప్రభుత్వ పనితీరుకు ఇది అడ్డం పడుతోందని బాధిత కుటుంబం అంటోంది. కాలనీ వాసులు ప్రియాంకా రెడ్డికి నివాళులు అర్పించారు. నిందింతులంతా 20 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండడం కూడా మరింత ఆందోళన కలిగించే అంశం. బాధితురాలు ఆందోళన చెందడం, అప్పుడే ఆమె చెల్లెలితో మాట్లాడిన సమయంలో పోలీసులు రెస్పాండ్ అయి ఉనింటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం పడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ప్ర...

స్లీపింగ్ లవర్స్ కు లక్కీ ఛాన్స్

చిత్రం
ఎప్పుడూ ఇంట్లో నిద్ర పోయే వాళ్ళుంటే వాళ్ళను తిట్టడం మామూలే. కానీ హాయిగా నిద్ర పోయే వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తోంది ఓ స్టార్ట్ అప్ కంపెనీ. తాము తయారు చేయబోయే పరుపుల కోసం సదరు కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎంత కంఫర్ట్ గా ఉంటే ఆ పరుపులు అంత డిమాండ్ ఉండేలా చేయడం దీని ప్రత్యేకత. నిద్ర ఎలా పడుతుంది. నిద్ర పట్టేందుకు పరుపు ఏ విధంగా తోడ్పడుతుంది. ఎలాంటి కలర్స్ వాడితే ఎంత సౌకర్య వంతంగా ఉంటుందో నని రీసెర్చ్ చేస్తోంది ఈ కంపెనీ. అయితే బంపర్ ఆఫర్ దక్కాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. ఇందు కోసం కంపెనీ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎంపికైన వారు రోజూ రాత్రి తప్పనిసరిగా 9 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. మంచిగా నిద్ర పోయే వాళ్లకు బెంగళూర్ కు చెందిన వేక్ ఫిట్ కంపెనీ అరుదైన అవకాశం ఇస్తోంది. అయితే మీరు మామూలుగా చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటల పాటు ఫుల్లుగ నిద్ర పోతే చాలు లక్ష రూపాయల జీతం ఇస్తామంటోంది ఈ కంపెనీ. అయితే 100 రోజుల పాటు ఈ డ్యూటీ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటు పడినట్లే. పప్పులో కాలు వేసినట్లే. ఇంకెక్కడో కా...

రండి..మాట్లాడుకుందాం

చిత్రం
నిన్నటి దాకా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 48 వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. 52 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, విద్యార్ధి, యువజన సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కార్మికులు చేసిన ఈ పోరాటం చిరస్థాయిగా నిలిచి పోయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్రసింగ్ చౌహన్ కార్మికుల వైపు నిలబడ్డారు. ఓ రకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసు కోవాలని సూచించారు. మరో వైపు విపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, కేంద్ర మంత్రి గడ్కరీ సైతం వెంటనే విధుల్లోకి తీసు కోవాలని కోరారు. తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడింది. దీంతో సీఎం కేసీఆర్ ఓ మెట్టు దిగారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి చర్యలు తీసుకుని ఉన్నట్లయితే కార్మికులు చనిపోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఇదే సమయంలో సీఎం లేటైనా లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి షరతులు పెట్టకు...

జీల్ కు మరిన్ని కష్టాలు

చిత్రం
ఒకప్పుడు ఇండియాలో ఒక వెలుగు వెలిగిన పలు కంపెనీలు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక భారం మోయ లేనంతగా ఉండడం, ప్రపంచ ఆర్థిక మంద గమనం తిరో గమనం వైపు సాగుతుండడంతో పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా అగుపించడం లేదు. తాజాగా ప్రమోటర్‌‌ సుభాష్‌‌ చంద్ర రాజీనామా అనంతరం వార్తల్లోకి వచ్చిన జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌ - జీల్‌‌ కు కొత్త సమస్యలు ఎదురు కానున్నాయి. తాజాగా సుబోధ్‌‌ కుమార్‌‌, నిహారికా వోహ్రా ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లు రాజీనామా చేయడం, ఆరోపణలు లేవ నెత్తడం వల్ల కంపెనీకి సమస్యలు తలెత్తనున్నాయి. కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ నిధులను సొంత అసోసియేషన్‌‌ కోసం ఖర్చు చేయడం సహా, కంపెనీలో పలు అక్రమాలు జరిగాయని వీరు ఆరోపించారు. దీంతో సెబీతో పాటు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి. సీఎస్‌‌ఆర్‌‌ నిధుల అక్రమాలపై ఎంసీఏ విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఆర్‌‌ఎస్‌‌ నిధులను జీ తన సొంత అసోసియేషన్‌‌ కోసం వాడినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని, ఇదే నిజమని తేలితే కంపెనీపై చర్యలు తప్పవని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. మాజీ డైరెక్టర్ల ఆరోపణలపై జీ స్ప...