పని చేయని సర్కార్ మంత్రం


దేశ ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన నోట్ల రద్దు మంత్రం ఏకంగా మోడీకి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని చేసిన ప్రకటనలు ఆచరణలోకి రాలేదు. నగదు లావా దేవీలు జరపడంలో బ్లాక్ మనీ ఎక్కువగా వాడుతున్నారని, వీటిని చెక్ పెట్టాలకునున్న పీఎం ఆలోచన వర్కవుట్ కాలేదు. నగదు లావాదేవీల్లో బ్లాక్‌ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన 1,000, 500 నోట్ల రద్దు  పూర్తి స్థాయిలో పట్టా లెక్క లేదు. ఈ నిర్ణయం తీసుకుని మూడేళ్లు గడిచినా, నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. 

రియల్‌ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్‌సీఆర్‌. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్‌ ప్రాపర్టీలల్లో మాత్రం క్యాషే కింగ్‌. మొత్తం ప్రాపర్టీ విలువలో 20 నుంచి 25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. బెంగళూరు, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్‌ గృహాల మార్కెట్లలో బ్లాక్‌ మనీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రాపర్టీ విలువలో సుమారు 30 శాతం దాకా నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు.

సర్కిల్‌ రేట్ల కంటే మార్కెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్న చోట, ఊహాజనిత కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్కిల్‌ రేట్లకు, మార్కెట్‌ రేట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోని రియల్టీ లావాదేవీల్లో నల్లధనం వినియోగం చాలా తక్కువ. ఉదాహరణకు గుర్గావ్‌లోని ఎంజీ రోడ్‌లో సగటు సర్కిల్‌ రేటు చ.అ.కు 11,205  లుగా ఉంటే.. మార్కెట్‌ రేటు 11,000లుగా ఉంది. అలాగే డీఎల్‌ఎఫ్‌ సిటీ ఫేజ్‌4లో డెవలపర్‌ విక్రయించే మార్కెట్‌ రేటు, అక్కడి సర్కిల్‌ రేటు రెండూ చ.అ.కు 10,800లుగా ఉంది. ముంబైలోని లోయర్‌ పరేల్‌లో సర్కిల్‌ రేటు చ.అ.కు 32,604, అదే మార్కెట్‌ రేటు 32,750లుగా ఉంది.

ప్రాథమిక గృహాల్లో కంటే రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరుగుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధికారిక చెల్లింపులను మాత్రమే అకౌంటెడ్‌గా చేస్తుండగా, మిగిలిన చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. రీసేల్‌ ప్రాపర్టీలల్లో ధర, పారదర్శకత రెండూ నల్లధన ప్రవాహానికి కారణమవుతున్నాయి.   స్థిరమైన ధర, క్రయ విక్రయాల్లో కఠిన నిబంధనలు లేక పోవటమే ఇందుకు కారణమని అనూజ్‌ పూరీ తెలిపారు. 
ఇక హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరిగేది స్థలాలు, ప్రీలాంచ్‌ గృహాల కొనుగోళ్లలోనే. పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్లు క్యాష్‌ రూపంలో జరగడానికి ప్రధాన కారణం అధికారులే. 

ఎందుకంటే చేయి తడిపితే గానీ పని చేయని ఆఫీసర్లు బోలెడు మంది. పెద్ద మొత్తంలోని ఈ సొమ్మును రియల్‌ ఎస్టేట్‌లో తప్ప బ్యాంక్‌లోనో లేక ఇంట్లోనో దాచుకోలేరు. అందుకే భారీగా స్థలాలు, ప్రీమియం గృహాల కొనుగోళ్లు చేస్తుంటారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్‌ తెలిపారు. రియల్టీ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని తగ్గించాలంటే మార్కెట్‌ ధరలను పెంచి.. స్టాంప్‌ డ్యూటీని తగ్గించాలని మరో డెవలపర్‌ సూచించారు. ఉదాహరణకు సదాశివపేటలో మార్కెట్‌ రేటు ఎకరానికి 50 లక్షలు, ప్రభుత్వ విలువ 70 వేలుగా ఉంది.

ఈ లావాదేవీలను వైట్‌ రూపంలో ఇవ్వడానికి డెవలపర్‌ రెడీనే. కానీ, అమ్మకందారులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం స్టాంప్‌ డ్యూటీని చెల్లించేందుకు అమ్మకందారు ఒప్పకోడు. అదే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రభుత్వ రేటును పెంచి.. స్టాంప్‌ డ్యూటీని తగ్గిస్తే వైట్‌ రూపంలో లావాదేవీలు జరిపేందుకు ముందు కొస్తారు. అప్పుడు ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లేకపోతే నల్లధనం బయటకు రావడం గగనమే.  

కామెంట్‌లు