జగన్ కు జేజేలు..జనం నీరాజనాలు


సందింటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దేశం అంతా తన వైపు చూసుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న యువ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. మాట ఇవ్వడం దానిని అమలు చేసేంత దాకా నిద్రపోని తత్వం కలిగిన ఈ దిగ్గజ నేత ఏది చేసినా అది జనం కోసమే. ప్రస్తతం ఏపీలో ఆయన హవా నడుస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకు వస్తున్నారు. ఆ మేరకు అధికారులను, తన మంత్రివర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారు.

ఆరు నెలల్లో అందరితో శెభాష్ ఆనిపించు కుంటానని ఆయన సవాల్ విసిరారు. దానిని తూచ తప్పకుండా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీలో ఖాళీ ఖజానా.. గాడిలో లేని పాలన.. అన్ని రంగాల్లోనూ అవినీతి విశృంఖలత..రాజ్యం ఏలుతోంది. దానిని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకు వచ్చాడు. తొలి అడుగే సంక్షేమ సంతకం చేశారు. అన్ని వర్గాలకు ఆలంబనగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ఏ ఒక్క పథకానికీ దూరం కాకూడదన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి తరచూ చెబుతున్నారు. నిర్ణీత సమయం లోగా సమస్యలు పరిష్కరించే ‘స్పందన’ కార్యక్రమం ఎంతో ఊరట కలిగిస్తోందని జనం అంటున్నారు.

ఈ స్వల్ప వ్యవధిలోనే అనేక ‘పరీక్షల’ను అధిగమించి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు.. అందు లోనూ కొత్తగా 1.40 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. పెరిగిన వేతనాలు అనేక రంగాలలో కొత్త ఉత్తేజానికి ఊపిరులూదాయి. మద్యనిషేధం దశలు మొదలు కావడం మహిళల్లో హర్షాతిరేకాలు పెంచాయి. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేయడమే కాదు అవినీతికి తావులేని పారదర్శక పాలన చూసి విమర్శకులు సైతం కితాబులిచ్చేలా జగన్‌ ముందుకు సాగుతున్నారు. మౌలిక రంగాలైన విద్య, వైద్యంలో సమూల మార్పులు చేపట్టారు.

పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగు పరచేందుకు నిర్ణీత కాలాన్ని, లక్ష్యాలను నిర్దేశించారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం వంటివి సామాజిక మార్పు దిశగా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో మెరుగైన స్థానం కల్పించడం ఓ చరిత్ర. అంతే కాదు ఈ వర్గాలకు, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లోనూ 50  శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై సర్వత్రా అన్ని వర్గాల నుండి హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిపోతున్న జగన్ మరిన్ని జనానికి ఉపయోగపడే చర్యలు చేపట్టాలని కోరుకుందాం.

  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!