స్లీపింగ్ లవర్స్ కు లక్కీ ఛాన్స్


ఎప్పుడూ ఇంట్లో నిద్ర పోయే వాళ్ళుంటే వాళ్ళను తిట్టడం మామూలే. కానీ హాయిగా నిద్ర పోయే వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తోంది ఓ స్టార్ట్ అప్ కంపెనీ. తాము తయారు చేయబోయే పరుపుల కోసం సదరు కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎంత కంఫర్ట్ గా ఉంటే ఆ పరుపులు అంత డిమాండ్ ఉండేలా చేయడం దీని ప్రత్యేకత. నిద్ర ఎలా పడుతుంది. నిద్ర పట్టేందుకు పరుపు ఏ విధంగా తోడ్పడుతుంది. ఎలాంటి కలర్స్ వాడితే ఎంత సౌకర్య వంతంగా ఉంటుందో నని రీసెర్చ్ చేస్తోంది ఈ కంపెనీ. అయితే బంపర్ ఆఫర్ దక్కాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. ఇందు కోసం కంపెనీ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

ఎంపికైన వారు రోజూ రాత్రి తప్పనిసరిగా 9 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. మంచిగా నిద్ర పోయే వాళ్లకు బెంగళూర్ కు చెందిన వేక్ ఫిట్ కంపెనీ అరుదైన అవకాశం ఇస్తోంది. అయితే మీరు మామూలుగా చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటల పాటు ఫుల్లుగ నిద్ర పోతే చాలు లక్ష రూపాయల జీతం ఇస్తామంటోంది ఈ కంపెనీ. అయితే 100 రోజుల పాటు ఈ డ్యూటీ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటు పడినట్లే. పప్పులో కాలు వేసినట్లే. ఇంకెక్కడో కాదు మన ఇండియాలోనే బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ అనే కంపెనీ తాజాగా ఈ ఆఫర్ ఇచ్చింది.

డబుల్ కాట్ బెడ్ పరుపులను తయారు చేసే కంపెనీ ఇది. కస్టమర్లకు మంచి మ్యాట్రెస్ తయారు చేయడం కోసం స్లీప్ ప్యాట్రన్స్‌పై స్టడీ చేస్తున్నామని చెబుతున్నారు ఆ కంపెనీ డైరక్టర్ చైతన్య రామలింగ గౌడ. వేక్‌ఫిట్ కంపెనీ పెట్టిన ఈ ‘స్లీప్ ఆఫర్’కు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడున్న వారైనా తమ కంపెనీ వెబ్‌సైట్ వెకెఫిట్. కో లో చేసుకోవచ్చని చెబుతోంది. 100 రోజుల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా వాళ్ల ఆఫీసుకు కూడా వెళ్లక్కర్లేదు. అభ్యర్థులు బాగా నిద్ర పోగలరని నిరూపించు కునేందుకు ఓ డిష్క్రిప్షన్ రాసి పంపితే, ఇంటికే ఆ కంపెనీ మ్యాట్రెస్, స్లీప్ ట్రాకర్స్ పంపుతారు.

సెలెక్ట్ అయిన వాళ్లు నిద్ర పోయే సమయం మొత్తాన్ని వీడియో తీసి పంపాల్సి ఉంటుంది. సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చో కుండా రాత్రులు టైమ్‌కు నిద్ర పోయే వాళ్లకు ప్రిఫరెన్స్. పైజామాలు వేసుకుని పడుకోవాలి. ఎటువంటి వాతావరణం లోనైనా అంటే గోల గోలగా ఉన్నా, లైట్ ఉన్నా నిద్ర పోగలగాలి. పడుకున్నాక 20 నిమిషాల్లోపే నిద్రలోకి వెళ్లి పోవాలి. కాగా గురక పెట్టే అలవాటుంటే మాత్రం నో ఛాన్స్. ఇంకెందుకు ఆలస్యం నిద్రపోయే వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఏమో మీరూ విజేతలుగా నిలవొచ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!