ఏమిటీ ఘోరం..ప్రియాంకా క్షమించు

సభ్య సమాజం ఇవ్వాళ దోషిగా నిలబడింది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆపై నామ రూపాలు లేకుండా శవమయ్యారు. చివరకు ఆధారాలు సైతం దక్కని రీతిలో కాల్చబడ్డారు. ఇదేదో మర్డర్ సినిమా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ లో జరిగిన దారుణమైన, అమానవీయమైన సంఘటన. నిన్న కళ్లెదుటే రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో ను కాల్చిన దుర్ఘటన మరిచి పోక ముందే, మరో దారుణం కళ్ళముందే జరగడం బాధాకరం. టెక్నాలజీ పెరిగినా, చట్టాలు ఉన్నా, లెక్కలేనంతగా పోలీసులు రక్షణగా ఉన్నా ..వేలాది వాహనాలు, భారీగా జనం నిత్యం ప్రయాణం సాగించే శంషాబాద్ ప్రాంతం ఈ మొత్తం ఘటనకు సాక్షీ భూతంగా నిలిచింది.

ప్రభుత్వ పనితీరుకు ఇది అడ్డం పడుతోందని బాధిత కుటుంబం అంటోంది. కాలనీ వాసులు ప్రియాంకా రెడ్డికి నివాళులు అర్పించారు. నిందింతులంతా 20 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండడం కూడా మరింత ఆందోళన కలిగించే అంశం. బాధితురాలు ఆందోళన చెందడం, అప్పుడే ఆమె చెల్లెలితో మాట్లాడిన సమయంలో పోలీసులు రెస్పాండ్ అయి ఉనింటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం పడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో కీలకంగా ఆరిఫ్ అలియాస్ పాషా వ్యవహరించాడు.

జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితులకు ఉరి శిక్ష నే కరెక్టు అని ముక్త కంఠంతో నినదించారు. ఇంకొందరు మాత్రం వీరిని జనం సాక్షిగా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్, క్లినర్స్ కలిసి పక్క ప్లాన్ చేశారు. ప్రియాంకా రెడ్డిని మట్టు బెట్టారు. స్మార్ట్ ఫోన్స్ అదే పనిగా వాడడం కూడా ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి. ఇంకో వైపు ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ స్పందించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాస్వామిక వాదులు ముక్త కంఠంతో ఈ సంఘటనను ఖండించారు. రేప్ చేయడమే కాకుండా నామ రూపాలు లేకుండా తుద ముట్టించడం మాత్రం మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయని చెప్పడానికి ఇదో మచ్చు తునక. 

కామెంట్‌లు