పర్‌దేశి ..పర్‌దేశి జానా నహీ..ముజే ఛోడ్ కే..!

!...నువ్వు వెళ్లిపోతే నేనుండ లేను. సమస్తం నువ్వైనప్పుడు నేను నేనుగా ఎలా వుండగలను..? గుండె నిండా నువ్వే నిండి పోయినప్పుడు ..నా అడుగుల్లో నీ సవ్వడి వింటున్నప్పుడు ..నా ఆలోచనల్లో నువ్వు తచ్చట్లాడుతున్నపుడు ..నీ తలపుల్లో నా తనువు మమేకమైనప్పుడు..సమస్తమంతా నీ జ్ఞాపకాలు తోడేస్తుంటే..నేను మనిషిగా ఎలా వుండగలను..? ఇలా హృదయాలను కట్టి పడేసి..కన్నీళ్లు చెమర్చేలా చేసిన అద్భుతమైన సినిమా రాజా హిందూస్తానీ...! భారతీయ సినిమా చరిత్రను ఈ మూవీ తిరగ రాసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ మూవీ అటు అమీర్ ఖాన్‌ను ఇటు కరిష్మా కపూర్‌లకు జీవితాంతం మరిచి పోలేని విజయాన్ని అందించింది. ఇదంతా ఆ సినిమాకు ప్రాణం పెట్టి..అహోరాత్రులు కష్టపడి వెండితెర మీద ఆవిష్కరించిన ఘనత ఒక్కడికే దక్కుతుంది..అతడే దర్శకుడు దర్మేష్ దర్శన్. 1996 నవంబర్ 15 దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. పేద కుటుంబానికి చెందిన కారు డ్రైవర్..సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే దానిపై స్టోరీ లైన్‌ను తీసుకుని దీనిని తీశ...