ఎనీ టైం లోన్ ..ఎప్పుడైనా ఎక్కడైనా - అప్పు ఇంత ఈజీనా..!

సంపాదించడం ఏమో కానీ ఈ లోకంలో రుణం పొందాలన్నా..అప్పు చేయాలన్నా సవాలక్ష నిబంధనలు..లెక్కలేనన్ని కారణాలు. ఒక్కోసారి అనుకోకుండా డబ్బులున్నా సమయానికి బ్యాంకులలో..ఏటీఎంలలో డబ్బులుండవు. ఖాతాల్లో లెక్కలేనంత క్యాష్ వున్నా ..ఆపదలో ఆదుకోని పరిస్థితి ఎదురవుతుంది. బంగారాన్ని, ప్లాట్లను, ఫ్లాట్లను, నగలను, ఇండ్ల కాగితాలను తాకట్టు పెట్టినా డబ్బులు చేతికి అందవు. ఇలాంటి పరిస్థితులను స్వతహాగా అనుభవించిన ఓ జంట ఏర్పాటు చేసిన సంస్థ ఏకంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. పక్కా ప్లానింగ్..రిజల్ట్ వచ్చే దాకా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఎనీ టైం లోన్ స్టార్టప్ నిరూపిస్తోంది. వీరిద్దరి కథ ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. టైంను వేస్ట్ చేస్తూ..గడిపే కంటే ఇలా డిఫరెంట్‌గా ఆలోచిస్తే కొంతలో కొంతైనా తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశం ఉంది. ఇండియాలో ఆంట్రప్రెన్యూర్స్, స్టార్టప్‌ల సందడి పెరిగింది. ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం ఐటీ విభాగంలో భాగం చేశాయి. ఈ భార్యాభర్తలకు ఒకానొక ...