ఐసీసీ రేటింగ్స్‌లో మనోళ్లే టాప్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేటింగ్స్‌లో మన ఆటగాళ్లు టాప్ లో నిలిచారు. ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రెండో ప్లేస్‌లో ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మలు ఉండగా వీరిద్దరి మధ్య కొన్ని పాయింట్ల తేడా ఉండడం విశేషం. వీరిద్దరి మధ్య ఐసీసీ ర్యాంకింగ్ నెంబర్ వన్ రేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. టీమిండియా స్కిప్పర్ కోహ్లి మరోసారి నెంబర్ -1 ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. అయితే నెంబర్ -2 ప్లేస్‌లో ఉన్న రోహిత్ శర్మ ..ఈసారి తన పాయింట్లను భారీగా పెంచుకుని ..నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. జాబితాలో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ..కోహ్లికి రోహిత్ శర్మకు మధ్య కేవలం 6 పాయింట్ల తేడా మాత్రమే ఉన్నది. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లి 891 పాయింట్స్ దక్కించు కోవడంతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ వరల్డ్ కప్‌లో అయిదు ఆఫ్ సెంచరీలు సాధించాడు. ఐతే ..వరల్డ్ కప్‌లో అత్యధికంగా 5 సెంచరీలు సాధించి..వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఓపెనర్ ...