డైరెక్ట‌ర్ కామెంట్స్‌పై గ‌రం గ‌రం

వంగా సందీప్ రెడ్డి గుర్తున్నాడా..ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ డ‌మ్ కొట్టేసిన ద‌ర్శ‌కుడు. ఏకంగా ఆయ‌న విజ‌య దేవ‌ర‌కొండతో ఆ మ‌ధ్య తీసిన అర్జున్ రెడ్డి సినిమా కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. టాలీవుడ్‌తో పాటు ఇత‌ర స్టేట్స్‌ల‌లో కూడా ఢంకా భ‌జాయించింది. ఈ సినిమాకు యూత్ ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు. మితిమీరిన దృశ్యాలు ఉన్నాయ‌ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైనా ..మూవీ మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్రారంభంలో టాక్ అంత పెద్ద‌గా లేక పోయినా రాను రాను ఆ మూవీ మొత్తం టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఎక్క‌డ చూసినా ఆ మూవీ గురించిన చ‌ర్చ‌లే. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ మొత్తం సందీప్ రెడ్డినే. ఈ మూవీని చూసిన బాలీవుడ్ ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఏకంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి తెర‌కెక్కించారు ఈ డైరెక్ట‌ర్. తాజాగా అర్జున్ రెడ్డికి రీ మేక్ గా వ‌చ్చిన కబీర్ సింగ్ మూవీ 200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

అంచ‌నాలు మించి ఈ మూవీ బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్, కియారా అడ్వాణీని ముద్దు పెట్టుకునే స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ సీన్స్ గురించి దేశ‌మంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ కొంద‌రు మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ మూవీకి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం..రిలీజ్ కావ‌డం..బాక్సులు బ‌ద్ద‌లు కావ‌డంతో దానిని ప‌ట్టించు కోవ‌డం మానేశారు. ఎక్కువ‌గా చ‌ర్చ‌కు ఈ అంశంపైనే రావడంతో, డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి స్పందించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ..ఒక అమ్మాయి, అబ్బాయి ఒక‌రినొక‌రు గాఢంగా ప్రేమించుకుంటున్న‌ప్పుడు ..ఒక‌రినొక‌రు కొట్టుకోవ‌డం, ముట్టు కోవ‌డం...లాంటివి చేయ‌క పోతే ఆ బంధానికి అర్థం ఏముంటుంద‌ని, భావోద్వేగాలు క‌నిపించ‌వంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టి స‌మంత ఘాటుగా స్పందించారు.

డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు న‌న్ను అసంతృప్తికి లోను చేశాయి. అంత‌కు ముందు అర్జున్ రెడ్డి మూవీ బాగుంద‌ని ట్వీట్ చేశారు ఆమె. ఈ విష‌యంపై క‌బీర్ సింగ్ బాగో లేదంటున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా ఆమె పోస్టు చేసిన ట్విట్ట‌ర్ కామెంట్స్‌ను తిరిగి ప్ర‌చురించారు. దీనికి స‌మంత స‌మాధానం ఇస్తూ..ఒక సినిమా ఇష్ట‌ప‌డ‌టం వేరు. ఒక‌రు చేసిన వ్యాఖ్య‌ల‌తో విభేదించ‌డం వేరని పేర్కొన్నారు. నాకు అర్జున్ రెడ్డి క‌థ బాగా న‌చ్చింది. దాన‌ర్థం ..ఇష్టం వ‌చ్చిన‌ట్టు మ‌న‌తో ఉన్న వారిపై చేయి చేసుకునే కాన్సెప్ట్ నాకు న‌చ్చింద‌ని కాద‌ని బ‌దులిచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద కూడా స్పందించారు. న‌చ్చిన‌ప్పుడ‌ల్లా కొట్ట‌డం, ముద్దు పెట్టు కోవ‌డం వంటివి చేయ‌కూడ‌దు. అలా చేస్తే ..బ‌ల‌వంతం చేయ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. అలా చేయ‌న‌ప్పుడే ఎంత ప్రేముందో తెలుస్తుంద‌ని పేర్కొన్నారు. మొత్తం మీద సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇపుడు సినిమా రంగాల‌ను హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

కామెంట్‌లు