డిజిట‌ల్ టెక్నాల‌జీలో వీమియో హ‌ల్ చ‌ల్..!

మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఆయా కంపెనీలు అప్ డేట్ కాక‌పోతే ఇక అంతే సంగ‌తులు. అందుకే ఐటి దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణాలను ద‌గ్గ‌రుండి చూస్తుంటారు. రీసెర్చ్ అండ్ వింగ్ అనాలిసిస్ రంగం ప్ర‌త్యేకంగా ప్ర‌తి కంపెనీ ఏర్పాటు చేసుకుంటోంది. లేక‌పోతే వీటిన్నింటిని మేనేజ్ చేయాలంటే అతి క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. ఎప్పుడైతే ఇంట‌ర్నెట్ యాక్సెసబిలిటి పెరిగిందో డేటా వినియోగం అంత‌కంత‌కూ ఎక్కువ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నెక్టివిటీ మ‌రింత సుల‌భ‌త‌రంగా మారింది. ఒక‌ప్పుడు మాట్లాడాలంటే  ల్యాండ్ ఫోన్లు ఉండేవి. మొద‌టి సారిగా వ‌ర‌ల్డ్‌లో మోటోరోలా కంపెనీ మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చింది. అది ఇండియాలో ఎంట‌రైన‌ప్పుడు జ‌నం ఎగ‌బ‌డి కొన్నారు. ఆత‌ర్వాత స్టీవ్ జాబ్స్ సార‌థ్యంలోని ఆపిల్ కంపెనీ సృష్టించిన సునామీ దెబ్బ‌కు మిగ‌తా స్మార్ట్ ఫోన్లు దిగ‌దుడుపుగా మారాయి. శాంసంగ్ కంపెనీ పోటీ ఇచ్చినా త‌ర్వాత రెండో స్థానంలోనే నిలిచింది. 

ఆపిల్ ఫోన్స్, యాక్సెస‌రీస్, ల్యాప్ టాప్‌లు వాడ‌డం స్టేటస్ సింబ‌ల్‌గా మారిపోయిందంటే..దాని రేంజ్ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఒకానొక సంద‌ర్భంలో స్టీవ్ మాట్లాడుతూ..మ‌నం ఏం చేస్తున్నామ‌న్న‌ది ముఖ్యం కాదు. ధ‌ర ఎంత పెట్టామ‌న్న‌ది ప‌ట్టించుకోకండి. మ‌నం త‌యారు చేసే ఉత్ప‌త్తులు స‌ముద్రంలో ప‌డేసినా తిరిగి త‌న రూపు కోల్పోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే చాలు అదే మ‌న స‌క్సెస్. అదే మ‌న వ్యాపార సామ్రాజ్యానికి , బ్రాండ్ కు ,ఇమేజ్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ట్రిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారాన్ని సాధించి నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంది ఆపిల్ కంపెనీ. ఇక సెర్చింగ్ ఇంజ‌న్ దిగ్గ‌జ కంపెనీగా పేరున్న గూగుల్ ను లారీ లోపెజ్ అండ్ ఫ్రెండ్స్ ఏ ముహూర్తంలో క‌నిపెట్టారో కానీ ఇపుడ‌ది ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచే స్థాయికి చేరుకుంది. అమెరికా కేంద్రంగా నిర్వ‌హిస్తున్న ఈ కంపెనీ రోజు ఆదాయం అమెరికా స‌గ‌టు బ‌డ్జెట్ కంటే ఎక్కువేన‌ని చెప్పాలి. దీనికి మ‌న ఇండియ‌న్ సుంద‌ర్ పిచ్చాయ్ సిఇఓగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. టెక్నాల‌జీ ప‌రంగా ..ఏ స‌మాచారం కావాల‌న్నా..క్ష‌ణాల్లో మ‌న క‌ళ్ల ముందు ప‌రిచే ఒక అద్భుతమైన ప‌రిక‌రం, సాధ‌నం..వాహ‌కం ..గూగుల్ అనే చెప్పాలి. 

యూట్యూబ్‌ను స్వంతం చేసుకుంది గూగుల్. వీడియో మేకింగ్ , స్టోరేజ్, స్ట్రీమింగ్, అప్ లోడ్, టెలికాస్ట్ త‌దిత‌ర వాట‌న్నింటికి ఇపుడ‌ది ప్ర‌పంచ వేదిక‌గా మారింది. సామాజిక మాధ్య‌మాల‌లో యూట్యూబ్ చేస్తున్న హ‌ల్ చ‌ల్ అంతా ఇంతా కాదు. దీనికి పోటీగా స్టార్ గ్రూపు హాట్ స్టార్‌ను తీసుకు వ‌చ్చింది. మ‌రో వైపు నెట్ ఫ్లిక్స్ కూడా వీడియో స్ట్రీమింగ్ రంగంలోకి ఎంట‌రైంది. ప్రిమియం బేస్డ్‌గా సేవ‌లు అంద‌జేస్తోంది ఈ వీడియో కంపెనీ. మ‌రో వైపు వీట‌న్నింటికి ఝ‌ల‌క్ ఇస్తూ మ‌రో అమెరిక‌న్ బేస్డ్ కంపెనీ ..వీమియో త‌క్కువ టైంలోనే ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది ప్రపంచ వ్యాప్తంగా. క్లారిటీ, క్వాలిటీతో పాటు ఈజీ ప్రాసెస్‌, డేటా క‌న్వెర్ష‌న్, క‌నెక్టివిటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తీసుకు రావ‌డంతో వీమియో కంపెనీ స‌క్సెస్ అయింది. దీంతో అమెరికాతో పాటు ఇత‌ర కంట్రీస్‌లో కూడా వీమియోకు స‌బ్ స్క్రైబ‌ర్స్ అనూహ్యంగా పెరిగారు. మ‌రికొంద‌రు పేమెంట్స్ చెల్లిస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ పాపుల‌ర్ కంపెనీకి మ‌న ప్ర‌వాస భార‌తీయురాలు అంజ‌లీ సూద్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు 2017లో. అమె అంత‌కు ముందు ఎన్నో కంపెనీల‌కు జాబ్ కోసం అటెండ్ అయ్యారు. 

బ్యాంకుల గ‌డ‌ప‌లు తొక్కారు. ఎక్క‌డా స‌క్సెస్ కాలేదు. ఆమె లైఫ్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్ ..కానీ సూద్ అధైర్య ప‌డ‌లేదు. వ‌ర‌ల్డ్ లోనే నెంబ‌ర్ వ‌న్ కంపెనీగా వీమియోను తీర్చి దిద్దారు. ఇపుడా కంపెనీ డాల‌ర్ల పంట పండిస్తోంది. వీడియో క్రియేష‌న్స్ మీదే ఎక్క‌వ‌గా ఈ కంపెనీ ఫోక‌స్ చేస్తోంది. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఆమె ఎంబిఏ చ‌దివారు. 2005 నుంచి 2014 వ‌ర‌కు ఫైనాన్స్, మీడియా, ఈ కామ‌ర్స్ బిజినెస్ రంగాల‌లో అడ్వ‌యిజ‌ర్‌గా ప‌నిచేశారు. టైమ్ వార్న‌ర్ , అమెజాన్ కంపెనీలలో కూడా ప‌ద‌వులు నిర్వ‌హించారు. 2014లో గ్లోబ‌ల్ మార్కెటింగ్ హెడ్‌గా జాయిన్ అయ్యారు. ఆ త‌ర్వాత జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మార్కెట‌ర్స్, బ్రాండ్స్ కోసం ప్ర‌త్యేకంగా మెంబ‌ర్ షిప్ ప్లాన్‌ను అంజలి సూద్ ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయింది. ఆమె సాధించిన అపూర్వ‌మైన విజ‌యాన్ని గుర్తించిన యాజ‌మాన్యం ఏకంగా సిఇఓ పోస్టుకు సెల‌క్ట్ చేసింది. ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు పొందారు. అప‌జ‌యం విజ‌యానికి సోపానం అంటారు సూద్. నిజ‌మే క‌దూ. 

కామెంట్‌లు