గుజరాత్ రైతుల కహానీ - దిగొచ్చిన దిగ్గజ కంపెనీ

అమెరికా కార్పొరేట్ డ్రింక్స్ అండ్ ఫుడ్ బేవర్జీస్ కంపెనీ పెప్సికో గుజరాత్ ఆలుగడ్డల రైతులపై వేసిన కేసులను ఉపసంహరించుకుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా విపరీతమైన ఒత్తిడి రావడం..అది న్యాయసమ్మతం కానేకాదని రూఢీ అవడంతో ఈ దిగ్గజ కంపెనీ తలవంచక తప్పలేదు. ఒక రకంగా ఇది అన్నదాతల నైతిక గెలుపుగా భావించాలి. ఎఫ్‌సీ5 ఆలుగడ్డలను తమ అనుమతి లేకుండా గుజరాత్‌కు చెందిన రైతులు సాగు చేశారంటూ ..వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యుఎస్ పెప్సికో కంపెనీ కేసు నమోదు చేయించింది. దీనిపై పెద్ద దుమారం జరిగింది. మొత్తం తొమ్మిది మంది రైతులపై కేసులు నమోదు చేసేలా చేసింది ఈ సంస్థ. లేస్ పొటాటో చిప్స్ తయారీకి ఇది ఇబ్బందికరంగా ఉంటోందంటూ నమోదు చేసిన కేసులో పేర్కొన్నారు. ఈ నెల రెండున నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది పెప్సికో. ఈ పొటాటో వెరైటీని పండించాలన్నా లేదా సరఫరా చేయాలన్నా, అమ్మాలన్నా తమ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని..ఈ వంగడంపై తమకు పేటెంట్ హక్కు ఉందంటూ పెప్సికో లేస్ కంపెనీ సూట్ వేసింది. ఎఫ్‌సీ5 వంగడాన్ని రైతులు పెద్ద ఎత్తున పండించారు. అ...