ప్రపంచం మెచ్చిన 10 ఎయిర్ పోర్ట్స్ ఇవే
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు వేలాది విమానాలు లక్షలాది మందిని ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం విమానాశ్రయాలను ప్రయాణికులు ఆశ్రయించాల్సిందే. లేకపోతే ఎక్కడికీ వెళ్లలేం. కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఎయిర్‌లైన్స్ నడిస్తే చాలా మటుకు ప్రైవేట్ భాగస్వామ్యంలోని ఎయిర్ లైన్స్‌లు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. విమాన ప్రయాణం తప్పనిసరిగా కావడంతో వ్యాపారస్తులు, సంస్థలు, కంపెనీలు కొత్తగా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకొన్ని నిర్వహణ లోపం వల్ల తలుపులు మూసేస్తున్నాయి. ఉద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. ఓ వైపు కొన్ని మూత పడుతుంటే మరికొన్ని కొత్తవి పుట్టుకు వస్తూనే ఉన్నాయి.
ఎయిర్ పోర్ట్‌ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన, సౌకర్యాల ఏర్పాటు, ఫ్లయిట్ల కాల ప్రమాణం, తదితర వాటిని ప్రామాణికంగా తీసుకుని అంతర్జాతీయంగా ఎయిర్ పోర్ట్స్ జాబితాను ఎంపిక చేసింది. మొత్తం 10 లార్జెస్ట్ విమానాశ్రయాలను ప్రకటించింది. హార్ట్స్ ఫీల్డ్ లోని జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించింది. రెండో స్థానంలో బీజింగ్ లోని కేపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఎప్పటిలాగే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారీ ఎత్తున విమానాల ఏర్పాటు. ప్రయాణికులకు ఎనలేని వసతులు ఏర్పాటు చేశాయి ఈ విమానాశ్రయాలు. ఇక మూడో స్థానంలో లండన్‌లో పేరొందిన హీత్ రో ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఇంగ్లండ్ లో ఈ విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాలలో సర్వే చేపట్టగా..నాలుగో స్థానంలో ఓ హారే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పొందింది. ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేందుకు ట్రావెలర్స్ బెస్ట్ ఛాయిస్‌గా పేర్కొన్నారు. ఇక అయిదో స్థానంలో టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలిచింది. మరో వైపు ఆరో స్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం పొందింది. ఏడాదికి లక్షలాది మంది ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు రోజు ప్రయాణం చేస్తుంటారు. అత్యధిక ఆదాయం అమెరికాకు ఈ ఎయిర్ పోర్టు నుంచే లభిస్తోంది. ఇక ఫ్రాన్స్ లోని పారిస్ ఛార్లెస్ దే గ్వాడిల్ ఎయిర్ పోర్ట్ ఏడవ స్థానంలో నిలిచారు. ఎనిమిదో స్థానంలో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పొందింది. తొమ్మిదవ స్థానంలో ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టు నిలిచింది. ఇక పదో స్థానంలో హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎగబాకింది. మొత్తం మీద ఇండియా వరకు వస్తే ఏ ఒక్క ఎయిర్ పోర్ట్ ఈ పది స్థానంలో లేక పోవడం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి