ఓసీనే అందరి ఛాయిస్ - మస్తు మజా బాస్

ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. మనిషి జీవన విధానాన్ని శాసించే వాటిలో సవాలక్ష వ్యసనాలున్నాయి. వాటిలో మద్యం, సిగరెట్, ఉమెన్. ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత వెసులుబాటు కోసం ..కూసింత తృప్తి కోసం జనం వీటిని ఆశ్రయిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు లెక్కలేనన్ని వెలిశాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు తాగుతున్నారు. ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. ఈ మధ్య పాన్ మసాలాలు, పాన్ పరాఖ్‌లు , ఖిల్లీ కొట్లు , పాన్ షాప్‌లు లెక్కలేనన్ని వెలిశాయి. చిన్న స్థలం వుంటే చాలు. ఎవరైనా దాడులు చేస్తారేమోనని గల్లీలు వీటికి కేరాఫ్‌గా మారాయి. కావాల్సినంత గంజాయి దొరుకుతోంది. నాలుగో లేదా ఐదో అంతస్తులో నుల్చొని మెల్లగా గ్లాసులోకి ఒంపుకుని తాగుతూ..కిటికీ పక్కన ..స్నాక్స్ తీసుకుంటూ ..ప్రపంచాన్ని చూడటం చాలా మందికి అలవాటు..అది ఓ సరదా..ఇంకొందరికి అది కిక్కు ఇస్తుంది. మరికొందరికి అదో స్టేటస్ సింబల్ . ప్రతి సాయంత్రం మందు ప్రియులకు కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ అదే తాగుతూ వుంటే ఏం మజా వుంటుంది కదూ. కొత్త వారితో స్నేహాలు, మద్యంతో చిందులు..భలే అనిపిస...