ఓయో బంపర్ ఆఫర్..హోటల్ ఓనర్స్‌కు లక్కీ ఛాన్స్

రితేష్ అగర్వాల్ పేరు విన్నారా. అతడు సృష్టించిన సునామీకి ప్రపంచాన్ని హోటల్ రంగంలో శాసిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ జడుసుకుంటున్నాయి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనడానికి రితేష్ ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడ ఢిల్లీ..ఎక్కడ ఇండియా..ఎక్కడ వరల్డ్..ఓహ్..అతడు సాధించిన అపూర్వమైన విజయం కోట్లాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసిన ఓయో ఇపుడు సంచలనాలకు తెర తీసింది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా..ఏ హోటల్ ను సందర్శించినా ఓయో బోర్డు కనిపిస్తుంది. ప్రతి హోటల్ యజమానికి ఓయో వెన్ను దన్నుగా నిలుస్తోంది. 2013లో ఢిల్లీలో ఓయో అంకుర సంస్థను ప్రారంభించాడు రితేష్ అగర్వాల్. ఆయా హొటల్స్ ఓనర్స్‌తో ఓయో ఎంఓయు చేసుకుంటుంది. ఎవరైనా ప్రయాణికులు లేదా కస్టమర్లు అక్కడికి వెళ్లినా ముందుగానే సమాచారాన్ని ఆయా హోటల్స్‌కు సమాచారం చేరుతుందిక క్షణాల్లో. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని మొత్తం ప్రపంచలోని ప్రతి హోటల్‌తో అనుసంధానం అయ్యేలా చేశాడు రితీష్. అతడి దెబ్బకు ఇపుడు త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ హోటళ్లన్నీ ఓయో సక్సెస్‌ను చూసి షాక్‌కు గురవు...