రుచి సోయగం..పతంజలి పరం..!
ప్రపంచ మార్కెట్ నివ్వెర పోయేలా రాందేవ్ బాబా సారథ్యంలోని పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్..సోయా ప్రొడక్ట్స్‌లో రారాజుగా వెలుగొందుతున్న రుచి సోయా కంపెనీని చేజిక్కించుకుంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది పతంజలి. ఏ ముహూర్తాన బాబా ప్రారంభించాడో కానీ కార్పొరేట్ కంపెనీలు తెల్లమొహం వేశాయి. తక్కువ ఖర్చుతో పాటు నాణ్యవంతమైన అన్ని వస్తువులు, తినేందుకు కావాల్సిన ఐటమ్స్‌ను పతంజలి అందజేస్తోంది. భారతదేశంలోని ప్రతి గ్రామానికి పతంజలి విస్తరించింది. ఏ ఊరుకు వెళ్లినా..ఏ కిరాణకొట్టు దగ్గరకు వెళ్లినా..పతంజలి బోర్డు ..రాందేవ్ బాబా నవ్వుతూ ఉన్న ఫోటో దర్శనమిస్తుంది. ఒక దేశీయ కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుందని ఏ విదేశీ కంపెనీ ఊహించలేదు. పతంజలి కొట్టిన దెబ్బకు ఆయా కంపెనీలు చేష్టలుడిగి పోయాయి. తినే తిండి, కట్టుకునే బట్టలు, రోజూ వాడే వస్తువులు, ప్రతి ఒక్కటి ప్రతి చోటా లభిస్తున్నాయి.
క్వాంటిటి, క్వాలిటీతో పాటు చౌక ధరల్లో, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో మొత్తం భారతీయ మార్కెట్‌లో 30 నుండి 55 శాతానికి పైగా తన వాటాను పెంచుకుంది పతంజలి గ్రూప్. రాందేవ్ బాబా ..అందరికీ యోగా గురువుగానే పరిచయం అయినా, ఆయనలోని బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచం విస్తు పోయేలా తీర్చిదిద్దిన ఘనత ఆ కంపెనీకీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా ఉన్న బాలకృష్ణ ప్రసాద్.మెట్రో, స్పెన్సర్, బిగ్ బజార్, మోర్, తదితర బిగ్ మాల్స్ లలో పతంజలి ద్వారా తయారైన వస్తువులను అమ్ముతున్నారు. ఒకప్పుడు పతంజలి అంటే పక్కన పెట్టిన సదరు కార్పొరేట్ మార్కెట్ దిగ్గజ కంపెనీలన్నీ ఇపుడు తలవంచక తప్పలేదు. ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో కొలువు తీరారో..ఇక రాందేవ్ బాబా వ్యక్తిగత రేంజ్..అమాంతం ఆకాశపు అంచుల్లోకి చేరుకుంది. ఇపుడు పతంజలి అంటే..భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు కొండగుర్తు. అంతేకాదు పతంజలి అంటే భారతీయత కలబోత.
ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్న పతంజలి అన్ని రంగాలకు విస్తరించింది. ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుని..గణనీయమైన ఆదాయాన్ని స్వంతం చేసుకుని..4 వేల 350 కోట్ల టర్నవోర్ కలిగిన రుచి సోయా కంపెనీని చేజిక్కించుకుంది. ఈ ఏడాదిలో వ్యాపార పరంగా చూస్తే ఇదే అతి పెద్ద డీల్‌గా పేర్కొనవచ్చు. ఇంత భారీ ఎత్తున పతంజలి ఆయుర్వేద కంపెనీ బిడ్‌లో పాల్గొంది. ఎన్నో కంపెనీలు ప్రయత్నం చేసినా చివరకు రాందేవ్ బాబా..సక్సెస్ అయ్యారు. రుచికి సంబంధించిన బ్యాంకుల లావాదేవీలు, ఇతర వాటిపై కూడా మరికొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. 60 శాతం అప్పులను కూడా తీర్చాల్సిన బాధ్యత పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీలదే. హరిద్వార్ కేంద్రంగా పనిచేస్తున్న పతంజలి ..ఎవరికీ ..ఏ కంపెనీకి అందనంత దూరంలో ఆదాయంలో దూసుకెళుతోంది. కోట్లాది రూపాయలు కొల్లగొడుతూనే దిగ్గజ కంపెనీలకు దిమ్మ తిరిగేలా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ..వస్తున్న పతంజలి ..రేపు ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి