ద‌ర్బార్ అదుర్స్..త‌లైవా పోస్ట‌ర్ సూప‌ర్బ్..!

కోట్లాది అభిమానులను సంపాదించుకున్న త‌మిళ సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ డిఫ‌రెంట్ మూడ్‌తో దుమ్ము రేపిన పోస్ట‌ర్‌తో ప్ర‌పంచాన్ని షేక్ చేసేశారు. కోట్లాది మంది ఆ పోస్ట‌ర్‌ను చూసి నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఇండియ‌న్ మోస్ట వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన ఏ.ఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవా కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభ‌మైంది. జ‌యాప‌జయాల‌ను ప‌ట్టించు కోకుండా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్లే ఈ డైరెక్ట‌ర్ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. క్రియేటివిటీతో పాటు సామాజిక ప‌ర‌మైన మార్పుల‌ను కోరుకునే అంశాలతో పాటు స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ర‌జ‌నీకాంత్ తో సినిమా తీయాలంటే ద‌మ్ముండాలి. ఆయ‌న మేన‌రిజంతో పాటు ఆయ‌నుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అంచ‌నా వేయాలి. అంతే కాదు ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇక ఆ టెక్నిషియ‌న్ కెరీర్ ముగిసి పోయిన‌ట్టే. తీవ్ర‌మైన వ‌త్తిళ్ల మ‌ధ్య త‌లైవాతో సినిమా తీయాల్సి ఉంటుంది. బ‌డ్జెట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అది ఏనాడో 100 కోట్ల‌ను దాటి పోయింది. అంచ‌నాలు భారీగా ఉంటాయి. 

త‌లైవా అంటేనే ఇండియాలో ఓ బ్రాండ్. ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన ఈ సూప‌ర్ స్టార్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌కున్నంత ఫాలోయింగ్ ఇంకే హీరోకు లేదు త‌మిళ ఇండ‌స్ట్రీలో. ఆయ‌న న‌డిచినా, ఆయ‌న మాట్లాడినా..ఆయ‌న న‌వ్వినా..లేదా ఓ చూపు చూసినా..సిగ‌రెట్‌ను గాల్లోకి విసిరినా..ఇలా ఏ భంగిమ‌లోనైనా త‌ను త‌నే. వ‌య‌సు మీద ప‌డినా ఇంకా య‌వ్వ‌న‌పు ఛాయ‌ల‌తోనే అద్భుత‌మైన న‌ట‌న‌తో, డైలాగ్ డెలివ‌రీతో ..అభిమానులను అల‌రిస్తున్నాడు. సినీ మార్కెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేస్తున్నాడు. ర‌జ‌నీకాంత్ స్టామినా, స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో పెట్టుకున్న డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ..సినిమా పేరు పెట్టేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. చివ‌ర‌కు ద‌ర్బార్ అని డిసైడ్ చేశాడు. ఇది త‌లైవాకు న‌చ్చింది. ఇంకేం షూటింగ్ మొద‌లైంది. అంత‌కు ముందు యంగెస్ట్ డైరెక్ట‌ర్ పా.రంజిత్‌కు ఛాన్స్ ఇచ్చాడు ర‌జ‌నీ. ఇపుడు మురుగ‌దాస్ వంతు వ‌చ్చింది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని మురుగ‌దాస్ ఉప‌యోగించుకునేందుకు శ‌త‌విధాలుగా కృషి చేస్తున్నాడు. ప్ర‌తి ఫ్రేమ్ డిఫ‌రెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా డైరెక్ట‌ర్ ద‌ర్బార్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ఇంకేం వీక్ష‌కుల సంఖ్య కోట్ల‌ను దాటింది. అదిరిపోయే లుక్స్‌తో ర‌జ‌నీ అలా అల‌వోక‌గా న‌డుస్తున్నట్టు ఉండేలా తీసిన ఈ ఇమేజ్ ఇపుడు గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌ను షేక్ చేస్తోంది. 

ఎంత‌లా అంటే..ఆ సైట్ కొద్ది సేపు ఆగిపోయేలా ..అంత‌లా ల‌క్ష‌లు దాటి కోట్ల‌ను తాకేలా. ఇది ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఒకే ఒక్క అసెట్. త‌లైవా చిటికె వేసినా కోట్లు..న‌డిచొస్తే డాల‌ర్లు..అందుకే ఆయ‌న‌తో సినిమా తీయ‌డం అంటే ఓ రేంజ్ ..ఓ స్టేట‌స్ ఉండాలి. డైరెక్ట‌ర్ కూడా అంతే. స్వేచ్ఛ ఇస్తాడు. త‌ను పాత్ర‌లో లీన‌మ‌వుతాడు. ఒక‌టికి రెండుసార్లు వింటాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ టేక్‌లు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. కానీ కేరెక్ట‌ర్ పండేదాకా వ‌దిలి పెట్ట‌డు..అందుకే ర‌జ‌నీ సూప‌ర్ స్టార్‌గా ఇంకా త‌న ప్లేస్‌ను అలాగే నిల‌బెట్టుకుంటున్నాడు. ద‌ర్బార్ మూవీకి అలీరాజా శుభాక‌ర‌న్ నిర్మాత‌. క‌థ‌, స్క్రీన్ ప్లే , ద‌ర్శ‌క‌త్వం అంతా మురుగ‌దాస్‌దే. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌తో పాటు సునీల్ శెట్టి, న‌య‌నతార‌, నివేదిత థామ‌స్, ప్ర‌తీక్ బ‌బ్బార్, న‌వాబ్ షా, దాలిప్ తాహిల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం,  సినిమాటోగ్ర‌ఫీ సంతోష్ శివ‌న్ చేస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్, డిస్ట్రిబ్యూష‌న్ అంతా లైసా ప్రొడ‌క్ష‌న్స్ చూసుకుంటోంది. వ‌చ్చే ఏడాది అంటే 2020 జ‌న‌వ‌రి 15న ప్ర‌పంచ , దేశ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్బార్‌ను. 20 ఏళ్ల త‌ర్వాత పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్న ర‌జ‌నీకాంత్ ను తిరిగి పోస్ట‌ర్ ద్వారా చూడ‌డంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుటున్నారు. ప్రిన్స్ తో తీసిన స్పైడ‌ర్ బోల్తా కొట్ట‌డంతో మురుగ‌దాస్ త‌లైవాతో సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. 

కామెంట్‌లు