ఐఏఎస్ టాపర్..నాలుగుసార్లు ఫెయిల్

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు యుపీఎస్సీ ప‌రీక్ష త‌ప్పాడు ఆ యువ‌కుడు. కానీ అంద‌రిలాగా నిరాశ‌కు గురి కాలేదు. ప‌ట్టుద‌లని విక్ర‌మార్కుడిలా క‌ష్ట‌ప‌డ్డాడు. అనుకున్న‌ది సాధించాడు. ఏకంగా ఇండియాలో టాప‌ర్‌గా నిలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. అత‌డెవ‌రో కాదు కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుర్రాడు..దురిశెట్టి అనుదీప్. జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ప‌రీక్ష‌కు వేలాది మంది పోటీ ప‌డ‌తారు. ఈ కాంపిటిష‌న్‌ను త‌ట్టుకుని ప‌రీక్ష పాస్ కావ‌డం చాలా క‌ష్టం. ప్ర‌తి ఒక్క‌రి క‌ల అమెరికా డాల‌ర్లు సంపాదించ‌డం ఒక ఎత్తైతే..ఇండియాలో గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్ర‌తి యువ‌తీ యువ‌కుల క‌ల ఒక్క‌టే ఐఏఎస్‌కు ఎంపిక కావ‌డం. అయిదు సార్లు మాత్ర‌మే రాసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏ మాత్రం త‌ప్పినా ఇక మ‌రోసారి ఎగ్జామ్ రాసేందుకు అర్హులు కారు. కానీ మ‌నోడు నాలుగు పర్యాయాలు త‌ప్పాడు..చివ‌ర‌కు ఐదో సారికి ఎంపిక‌య్యాడు. ఏకంగా ఇండియాలో టాప్‌లో నిలిచాడు అనుదీప్. 

సాధించాల‌న్న క‌సి, ప‌ట్టుద‌ల ఉంటే చాలు ఎంత‌టి క‌ష్ట‌మైనా ఈజీ అవుతుంద‌ని, విజ‌యం త‌ప్ప‌కుండా వ‌రిస్తుంద‌ని అంటున్నారు ఈ యువ‌కుడు. జాతీయ స్థాయిలో టాప్ పొజిష‌న్‌లో నిల‌వడం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో అసిస్టెంట్ ట్యాక్స్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు అనుదీప్. ఎవ్వ‌రినీ సంప్ర‌దించ‌లేదు. స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా తీసుకోలేదు. నా ల‌క్ష్యం ఒక్క‌టే ఐఏఎస్ కావాల‌ని..దాని కోసమే క‌ష్ట‌ప‌డ్డా. రేయింబ‌వ‌ళ్లు కూర్చోలేదు. కానీ స‌బ్జెక్టుల‌ను పూర్తిగా ఆక‌ళింపు చేసుకున్నా. ప‌ద్ధ‌తి ప్ర‌కారం చ‌దివా. నోట్స్ రాసుకున్నా. కాంపిటిష‌న్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుసు. నా ముంద‌న్న‌ది ఒక్క‌టే ఐఏఎస్. నా పేరు ప‌క్క‌న ఉండాల‌ని అనుకున్నా..సాధించానంటున్నాడు. ఎందుకు త‌ప్పి పోయానో ప్ర‌తి సారి న‌న్ను నేను ప‌రిశీలించుకున్నా. ఎక్క‌డ పొర‌పాట్లు చేశానో చూసుకున్నా. అలాంటివి తిరిగి పునార‌వృతం కాకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డా. ఐదో సారి చావో రేవో తేల్చుకుందామ‌ని ప్రిపేర్ అయ్యా. 

అనుకున్న‌ది సాధించా. స‌క్సెస్ ఎవ‌రి స్వంతం కాదు. అది అంద‌రినీ ఊరిస్తుంది. ఛాలెంజ్ విసురుతుంది. ఎవ‌రు క‌ష్ట‌ప‌డితే వారి చెంత‌కు చేరుతుంది. ఇంత‌కంటే ఏం చెప్పాలి..నేనే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అంటున్నారు..అనుదీప్. అంత‌కు ముందు అత‌ను బిట్స్ పిలానీలో చ‌దువుకున్నాడు. ఈ విజ‌యం వెనుక నా శ్ర‌మ‌తో పాటు నా కుటుంబం స‌పోర్ట్ ఎక్కువ‌గా ఉంది. వారి పోత్సాహం లేక‌పోతే నేను ఇంత‌టి గెలుపును సాధించ‌లేక పోయేవాడిన‌ని స్ప‌ష్టం చేశారు. 
దేశ వ్యాప్తంగా యుపీఎస్‌సీ నిర్వ‌హించిన ప‌రీక్ష‌కు సంబంధించి 9 ల‌క్ష‌ల 50 వేల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4 ల‌క్ష‌ల 56 వేల 625 మంది అటెండ్ అయ్యారు. 13 వేల 366 మంది మెయిన్ ఎగ్జామ్‌కు క్వాలిఫై అయ్యారు. 2 వేల 568 మంది ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌కు అర్హ‌త సాధించారు. ఫైన‌ల్‌గా 990 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసింది. ఇందులో 750 మంది ప‌రుషులు, 240 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌లుగా ఎంపిక చేశారు. టాప్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా అనుదీప్ నిల‌వ‌డం..అత‌డి ప‌ట్టుద‌ల‌కు ద‌క్కిన గౌర‌వం. సో..ఫెయిల్యూర్ అన్న‌ది నేరం కాదు..విజ‌యం అన్న‌ది గెలుపు కాదు..అదొక ప్ర‌యాణం మాత్ర‌మే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!