ఓయో బంప‌ర్ ఆఫ‌ర్..హోట‌ల్ ఓన‌ర్స్‌కు ల‌క్కీ ఛాన్స్

రితేష్ అగ‌ర్వాల్ పేరు విన్నారా. అతడు సృష్టించిన సునామీకి ప్రపంచాన్ని హోట‌ల్ రంగంలో శాసిస్తున్న దిగ్గ‌జ కంపెనీల‌న్నీ జ‌డుసుకుంటున్నాయి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంద‌న‌డానికి రితేష్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఎక్క‌డ ఢిల్లీ..ఎక్క‌డ ఇండియా..ఎక్క‌డ వ‌ర‌ల్డ్..ఓహ్..అత‌డు సాధించిన అపూర్వ‌మైన విజ‌యం కోట్లాది మందికి స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. త‌క్కువ పెట్టుబ‌డితో స్టార్ట్ చేసిన ఓయో ఇపుడు సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. ఇండియాలో ఏ మూల‌కు వెళ్లినా..ఏ హోట‌ల్ ను సంద‌ర్శించినా ఓయో బోర్డు క‌నిపిస్తుంది. ప్ర‌తి హోట‌ల్ య‌జ‌మానికి ఓయో వెన్ను ద‌న్నుగా నిలుస్తోంది. 2013లో ఢిల్లీలో ఓయో అంకుర సంస్థ‌ను ప్రారంభించాడు రితేష్ అగ‌ర్వాల్. ఆయా హొట‌ల్స్ ఓన‌ర్స్‌తో ఓయో ఎంఓయు చేసుకుంటుంది. ఎవ‌రైనా ప్ర‌యాణికులు లేదా క‌స్ట‌మ‌ర్లు అక్క‌డికి వెళ్లినా ముందుగానే స‌మాచారాన్ని ఆయా హోట‌ల్స్‌కు స‌మాచారం చేరుతుందిక క్ష‌ణాల్లో.

అందివ‌చ్చిన టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని మొత్తం ప్ర‌పంచ‌లోని ప్ర‌తి హోట‌ల్‌తో అనుసంధానం అయ్యేలా చేశాడు రితీష్. అత‌డి దెబ్బ‌కు ఇపుడు త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌న్నీ ఓయో స‌క్సెస్‌ను చూసి షాక్‌కు గుర‌వుతున్నాయి. ఇండియాలో టాప్ రేంజ్‌లో ఉన్న హోట‌ల్స్ రూమ్స్ బుకింగ్ ఇపుడు అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి ప్ర‌వేశించింది. ఎక్క‌డి చైనా..అక్క‌డ నెగ్గుకు రావాలంటే ఎంత ద‌మ్ముండాలి. అక్క‌డి మార్కెట్‌ను ఈజీగా అర్థం చేసుకున్న రితేష్..పూర్తిగా చైనా హోట‌ళ్ల‌తో ఓ బిగ్ నెట్ వ‌ర్క్‌నే ఏర్పాటు చేశాడు. ఇపుడు చైనాలో ఓయో ఓ సెన్సేష‌న్. త‌న మార్కెట్‌ను మరింత విస్త‌రించేందుకు డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశాడు..ఓయో అధిప‌తి. ఆయా హోట‌ల్ య‌జ‌మానుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. క‌స్ట‌మ‌ర్లు ఒక్క‌సారి ఓయోతో క‌నెక్ట్ అయితే తిరిగి త‌మ సేవ‌ల‌ను పొందేలా ఉండేందుకు మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక రూపొందించాడు.

ఇందు కోసం ఆధునికంగా హోట‌ళ్ల‌ను తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు రితేష్. ఇందుకోసం క‌స్ట‌మ‌ర్లు ఫుల్ సంతృప్తి చెందేలా ..ఓయో హోట‌ళ్లన్నింటిని స‌రికొత్త రీతిలో డిజైన్ చేస్తున్నారు. దీని కోసం త‌మ కంపెనీతో టై అప్ అయిన హోట‌ల్ య‌జ‌మానుల‌కు క్యాష్ ఇన్ బ్యాంక్ కార్య‌క్ర‌మం కింద 45 కోట్ల రూపాయ‌ల‌ను అంద‌జేసింది. హోట‌ల్ ప‌రిశ్ర‌మ రంగంలో ఇలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి. ఈ ప్రోగ్రామ్ కింద 9 వేల మందికి పైగా ల‌బ్ది పొంద‌నున్నారు. ఇదే స‌మ‌యంలో నాణ్య‌మైన స‌ర్వీసులు, సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌ని 1000 మంది హోట‌ల్ య‌జ‌మానులపై జ‌రిమానా కూడా విధించింది ఓయో. ఇండియాలో, సౌత్ ఏషియాలో త‌న‌కున్న 10 వేలకు పైగా ఉన్న హోట‌ల్స్‌లో 3సీ ఎవాల్యూయేష‌న్ ప్రోగ్రామ్‌ను చేప‌డుతోంది. దీనిలో భాగంగా ఫైన్ విధించింది. క‌స్ట‌మ‌ర్లు, టూరిస్టుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఫీల్ అయ్యేలా చేయ‌డం త‌మ ముందున్న క‌ర్త‌వ్య‌మంటున్నారు ఓయో సిఇఓ. అత‌డి క‌ల నెర‌వేరాల‌ని ఆశిద్దాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!