క్రికెట్ లెజెండ్‌కే టీమిండియా కోచ్ ఎంపిక అప్పగింత
ప్రపంచ కప్ కథ ముగిసింది. విండీస్ పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ ఎం.ఎస్.కె. ప్రసాద్ ఇప్పటికే మూడు ఫార్మాట్‌లలో ఆడే టీమిండియా క్రికెట్ జట్టు సభ్యులను, కెప్టెన్‌ను ప్రకటించారు. ఈ ఎంపిక కార్యక్రమం తీవ్ర విమర్శలు, ఆరోపణల మధ్య ఎంపిక చేశారు. అసలైన జట్టును ఎంపిక చేయలేదని, కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు పొడ సూపాయని, అందుకే ఇండియా పేలవమైన ఆటతీరును ప్రదర్శించిందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. కమాన్ ఇండియా అంటూ వరల్డ్ కప్ ను తీసుకు రావాలని కోరిన కోట్లాది అభిమానులకు తీరని నిరాశ మిగిల్చారు క్రికెటర్స్. కోట్లు ఎలా సంపాదించాలి, ఏయే కంపెనీలతో టై అప్ చేసుకోవాలో అనే దానిపై ఉన్నంత శ్రద్ధ క్రికెట్‌ను శ్వాసగా మల్చుకుని , గెలవాలన్న కసి లేకుండా పోయింది. అంతులేని రాజకీయాలు చోటు చేసుకోవడం, ఆధిపత్య పోరుకు తెర తీయడం బీసీసీఐ పాలిట శాపంగా మారింది. భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని స్థితికి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు ..దీని వెనుక ఎన్ని కార్పొరేట్ , దిగ్గజ కంపెనీలు పనిచేస్తున్నాయో..బడా బాబుల హస్తం ఉందో.
క్రికెట్ అంటే ఒకప్పుడు అద్భుతమైన క్రీడ. అది రాను రాను వ్యాపారంగా మారి పోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ దాల్మియా బీసీసీఐ పగ్గాలు చేతికి తీసుకున్నాడో అప్పటి నుంచి ఇండియా ఆట స్వరూపమే మారి పోయింది. అంతకు ముందు హర్యానా హరికేన్, ఇండియన్ క్రికెట్ లెజండ్ , ఫాస్టెస్ట్ బౌలర్‌గా ప్రసిద్ది చెందిన కపిల్‌దేవ్ నిఖంజ్ ఎప్పుడైతే 1983లో ప్రపంచ కప్పును భారత్‌కు తీసుకు వచ్చాడో ఇక అక్కడి నుంచి ఇండియా అంటేనే క్రికెట్ ..క్రికెట్ అంటేనే భారత్ అనే స్థాయికి చేరుకుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..దేశమంతటా క్రికెట్ ఫీవర్ వ్యాపించింది. మూడేళ్ల చిన్నారుల నుంచి 90 ఏళ్ల వయస్సు మళ్లిన వారు సైతం ఈ ఆటంటే పడి చస్తున్నారు. చూడలేకుండా ఉండలేక పోతున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బడా కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. ఏ ఒక్క ఛాన్స్ మిస్సవడం లేదు. బీసీసీఐని పావనం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత అధిక ఆదాయం కలిగిన సంస్థగా ఇప్పటికే రికార్డు బ్రేక్‌లు చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటూ వచ్చిన ఈ సంస్థ మీద ఆధిపత్యం చెలాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. కానీ ఫెయిల్ అయ్యాయి.
110 కోట్లకు పైగా ఉన్న జనాభాలో 70 శాతానికి పైగా జనం క్రికెట్ జపం చేస్తున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ప్రపంచ మీడియా రంగాన్ని శాసిస్తూ ..నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న స్టార్ టీవీ గ్రూప్ ఏకంగా బీసీసీఐ నుంచి క్రికెట్ ప్రసార హక్కులను 1647 కోట్లకు చేజిక్కిచ్చుకుంది. అంటే దీనికున్న డిమాండ్ ఏపాటిదో అర్థమవుతుంది. స్టార్ గ్రూప్ ఛైర్మన్ అండ్ సిఇఓ ఉదయ్ సింగ్ ..ఎవరూ ఊహించని రేట్‌కు బిడ్‌లో పాల్గొని సోనీ కంపెనీకి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు. ఏకంగా ప్రపంచ కప్ సందర్భంగా ప్రసారం చేసిన మ్యాచ్‌లకు స్టార్ గ్రూప్‌కు ఎనలేని ఆదాయం వచ్చింది. దీంతో స్టార్ తన సిబ్బందికి ప్రత్యేకంగా బోనస్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లోనే తన ప్రసారాలను టెలికాస్ట్ చేస్తోంది. దీంతో వ్యూవర్ షిప్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘమే టీమిండియా కోచ్‌ను ఎంపిక చేస్తుందని బీసీసీఐ చైర్మన్ ఎం.ఎస్.కె. ప్రసాద్ వెల్లడించారు. ఆగస్టు రెండు లేదా మూడో వారంలో అభ్యర్థులను కమిటీ ఇంటర్వూలు చేస్తుందన్నారు. కపిల్ దేవ్‌తో పాటు మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి, పురుషుల జట్టు మాజీ కోచ్ గైక్వాడ్ సభ్యులుగా క్రికెట్ పాలకుల కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. పూర్తి స్థాయి కోచ్‌ను ఈ కమిటీ ఎంపిక చేస్తుందన్నారు. శ్రీలంకకు చెందిన జయవర్దనేతో పాటు పలువురు క్రికెటర్లు కోచ్ పదవి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి