న బూతో న భవిష్యత్ - అశ్లీలం సర్వ నాశనం

నాలుగు గదుల్లో దాచు కోవాల్సినవన్నీ ఇపుడు బహిర్గతమై పోతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ మంచి కంటే చెడు ఎక్కువగా ముక్కు పచ్చలారని యువతీ యువకులను టార్గెట్ చేస్తోంది. భోజనం లేకుండా ఉండగలరమో కానీ మొబైల్స్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు. కాదంటే బాధ..వద్దంటే కోపం..కన్నవారి మీద కసురు కోవడాలు..కుటుంబం అంటే గౌరవం లేదు. పాఠాలు చెప్పే వారి పట్ల కృతజ్ఞత లేదు. బట్టీ పట్టడాలు..ర్యాంకుల మోతలు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్లలకు అర్థమై పోతోంది. ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్లలను పట్టించు కోవడం లేదు. గాలికి వదిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్నారు. బంధాలకు అర్థం లేకుండా పోయింది. డాలర్ల మాయలో పడిన వీరంతా దేశాన్ని ఏం రక్షిస్తారో తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వచ్చాక..రిలయన్స్ జియో ఎంటర్ అయ్...