పోస్ట్‌లు

ఏప్రిల్ 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సంతాపం స‌రే..ప‌రిహారం మాటేమిటి..?

చిత్రం
ఇంట‌ర్ బోర్డులో నెల‌కొన్న గంద‌ర‌గోళం కంటిన్యూ అవుతూనే వుంది. సింపుల్‌గా సంతాపం ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. 20 మందికి పైగా పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే..ప‌రిహారం ఊసెత్త‌లేదు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఒక్క ప‌రీక్ష‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించిన పాపాన పోలేదు. విద్యా వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింది. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో తెలియ‌డం లేదు. ఉన్న‌తాధికారులు బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన స్టూడెంట్స్, పేరెంట్స్ ప‌ట్ల పోలీసుల అనుస‌రించిన తీరు గ‌ర్హ‌నీయం. ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్, విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డిలు పిల్ల‌ల ప‌ట్ల నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఎలాంటి అనుభవం లేనటువంటి గ్లోబ‌రినా సంస్థ‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అప్ప‌గించ‌డం వెనుక ఎంత మంది చేతులు మారాయో బ‌య‌ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. వంద‌లాది మంది విద్యార్థులు బాగా చ‌దివినా మార్కులు పొంద‌లేక పోయారు. దీనిని సీరియ‌స్‌గా ప్ర‌భుత్వం తీసుకోక పోవ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఫెయిల్ అయిన విద్యార్...