సాన్యా సంచలనం..పుస్తక ప్రభంజనం..!

లోగ్ క్యా కహేంగే..అంటూ సాన్యా ఖురానా రాసిన పుస్తకం దేశ వ్యాప్తంగా అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. వృత్తి రీత్యా సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన ఈ అమ్మాయి రాయడంలో అందెవేసిన చెయ్యి. తన మీద తనకు అపారమైన నమ్మకం , ఆత్మ విశ్వాసం కలిగిన ఈమె అనుకోకుండా రచయిత్రిగా మారారు. అంతకు ముందు ఆమె అడోబ్ ఐటి కంపెనీలో పని చేశారు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచేలా ప్రత్యేక కథనాలు రాశారు. సాన్యా రాసిన పుస్తకం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. అమెజాన్ కంపెనీలో ఇప్పుడు ఈ బుక్ సంచలనం రేపుతోంది. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సాన్యా పర్యటించారు. ఈ జర్నీలో ఎందరినో కలిశారు. వారితో మాట్లాడారు. ఆ అనుభవాలనే అక్షరబద్దం చేశారు. ఈ పుస్తకం ఇప్పుడు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఖురానాకు కాసులు కురిపిస్తోంది. ఒక్క రోజులోనే ఆమె మోస్ట్ పాపులర్ రైటర్ గా పేరు సంపాదించారు. వుమెన్ డ్రీమ్స్ అండ్ యాంబిషన్స్ నే ఆమె టార్గెట్ గా పెట్టుకున్నారు. లీన్ ఇన్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఖురానా స్థాపించారు. ఒక రోజు ఆమె తండ్రి తనకు చదువుకునేందుకు ఓ పుస్తకం చేతిలో పెట్టారు. అందులో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ...