అమోఘం..అద్భుతం..ఆనంద సాయి కళా నైపుణ్యం..!
కళా దర్శకుడిగా, అద్భుతమైన ఆర్కిటెక్ట్ గా వినుతి కెక్కిన ఆనందసాయి కళా నైపుణ్యం మరోసారి వేలాది మంది భక్తుల హృదయాలను తాకుతోంది. తెలంగాణకే తలమానికంగా భావించే శ్రీ లక్ష్మి నరసింహ్మస్వామి కొలువై వున్న యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, నభూతో న భవిష్యత్ అన్న రీతిలో తీర్చి దిద్దుతున్నారు. ఆర్కిటెక్ట్ గా ఎంతో అనుభవం కలిగిన ఆయనను ఏరి కోరి జగత్ గురు శ్రీ చిన్న జీయర్ స్వామి అప్పగించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. ఆలయ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్పనైన ఆలయంగా తీర్చి దిద్దాలని, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఇస్తానని చెప్పారు. వెంటనే నిధులు మంజూరు చేశారు.
ఆనంద సాయి పర్యవేక్షణలో ఆలయ పనులు సాగుతున్నాయి. వందలాది మంది శిల్పులు ఈ దైవ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. ఆనంద సాయి శిల్పా కళా నైపుణ్యం కలిగిన వారు. అందుకే ఈ ఆలయం సుందరంగా రూపొందుతోంది. కళా దర్శకుడిగా ఆయన సినిమా రంగంలో పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయనకు ఉపయోగ పడింది. ఆనంద సాయిలో నైపుణ్యాన్ని గుర్తించిన చిన్న జీయర్ స్వామిజి సాయికి అతి పెద్ద ప్రాజెక్ట్ అప్పగించారు. అదే తన ఆశ్రమంలో రామానుజుల వారి భారీ విగ్రహం ఏర్పాటు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ ప్రాజెక్ట్ పనులను అప్పగించారు. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఆయన కలల ప్రాజెక్ట్ ఇది. తిరుమలను తలదన్నే రీతిలో యాదాద్రి ఉండాలని ఆయన చిరకాల కోరిక. ఆ దిశగా ఆలయం రూపు దిద్దుకుంటోంది. ఎవడు సినిమాకు పని చేస్తున్న సమయంలోనే ఆనంద సాయికి ఈ ఆఫర్ దక్కింది.
జూనియర్ ఎన్ఠీఆర్ , అల్లు అర్జున్, నారా లోకేష్ , రామ్ చరణ్ వెడ్డింగ్స్ కు ఆయన ఆధ్వర్యంలో పెళ్లి మండపాలు, ఇతర కార్యక్రమాలు , ఈవెంట్స్ జరిగాయి. ఫామిలీ వెడ్డింగ్స్ డిజైన్స్ మై హోమ్ రామేశ్వర్ రావ్ ను ఆకట్టుకున్నాయి. దీంతో రామేశ్వర్ రావ్ సాయిని గుర్తించారు.అలా చిన్న జీయర్ స్వామితో బంధం ఏర్పడింది. అది అతి పెద్ద ఆలయ పనులు దక్కేలా చేసాయి. 108 దివ్య దేశ టెంపుల్స్ ను నిర్మించే పని దొరికింది. ఇండియా లోని ఆలయాలను సందర్శించేలా పర్మిషన్ ఇచ్చారు. స్వామి అమెరికా వెళ్లి వచ్చే లోపు సాయి అన్నిటిని చూసి వచ్చారు. ఆయా ఆలయాల శిల్ప కళా సంపద, నైపుణ్యాన్ని స్వతహాగా తెలుసుకున్నారు. అదే ఇప్పుడు పనికి వస్తోంది సాయికి . మొత్తం మీద ఆనంద సాయి ఎవరో తెలుసు కోవాల్సిన అవసరం లేదు . ఒక్కసారి ఆ యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు . అతడు ఎంత గొప్ప కళా ఆరాధకుడో..కళా నైపుణ్యం కలిగిన వ్యక్త్తో. అడుగడుగునా యాదాద్రిలో కళాత్మకత తొక్కిసలాడుతోంది. కలలు అందరూ కంటారు ..కానీ కొందరే వాటిని నిజం చేస్తారు. అందులో ఆనంద సాయి ఒకరు. కాదంటారా..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి