.జెట్ ఎయిర్ వేస్‌కు ఎథిహాద్ కాయకల్ప చికిత్స

అన్నం పెట్టే రైతులకు రుణాలు మంజూరు చేయాలంటే నానా ఇబ్బందులకు గురి చేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు సంక్షోభం దిశగా నానా అవస్థలు పడుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థను గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతోంది. ప్రజలు కష్టపడి ఎస్‌బిఐలో పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులను అప్పనంగా జెట్ ఎయిర్ వేస్ కు కట్టబెట్టింది. తాము సర్వీసులు నడిపే స్థితిలో లేమంటూ సదరు యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో దానిని తిరిగి నిలబెట్టేందుకు ఎస్‌బిఐ నేరుగా రంగంలోకి దిగింది. ఇతర డబ్బున్న వ్యాపారులు, సంస్థలు, కంపెనీలతో చర్చోప చర్చలు చేస్తోంది. ఆ బ్యాంకు చీఫ్ రజ్‌నీష్ కుమార్ ఈ మేరకు త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం తమకుందని స్పష్టం చేశారు. విమానాలు నడుపుతున్న జెట్ ఎయిర్ వేస్ ప్రైవేట్ కంపెనీకి ఎస్‌బిఐ ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా అందజేసింది. ఇపుడు సదరు కంపెనీ బ్యాంకుకు 8 వేల 400 కోట్లు బాకీ పడింది. ఇంత మొత్తం డబ్బులన్నీ ప్రజలవే. తిరిగి రోప్ వేపై విమానాలు తిరుగుతాయని ఈ బ్యాంకర్ చీఫ్ చిలుక పలుకులు పలుకుతున్నారు. జెట్ ఎయిర్ వేస్ ను దక్క...