చంద్రబాబు మంత్రాంగం ఫలించేనా ..?
వయసు మీద పడినా ఎలాంటి తొట్రుపాటు పడకుండా యువతీ యువకులతో పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అపారమైన రాజకీయ అనుభవాన్ని ఆయన గడించారు. పాలనాపరంగా పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు పరిపాలన సాగించారు. ఆ సమయంలోనే ఆయన తెలంగాణ ప్రాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయారు. ఇక్కడి అపారమైన వనరులను గుర్తించారు. వాటిని తమ ప్రాంతానికి తరలించుకు పోయేలా చేశారు. అంతేకాకుండా పూర్తిగా ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టారు. ఆయన పాలనలో తెలంగాణ ప్రజలు నరకాన్ని చవి చూశారు. తీవ్రమైన కరవు కాటకాలకు లోనయ్యారు.
కొలువుల్లోను, నిధుల కేటాయింపుల్లోను..నీళ్ల పంపిణీలోను తీవ్రమైన వివక్షకు లోనైనా పట్టించు కోలేదు. ఎక్కడలేని ప్రయారిటీ రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు దారదత్తం చేశారు. అన్నింటికంటే ఆర్థిక సంస్కరణలకు తెర లేపారు. ప్రపంచ బ్యాంకుకు ఏపీలో ప్రభుత్వ పరంగా రెడ్ కార్పెట్ పరిచారు. జన్మభూమి పేరుతో కాలయాపన చేశారు. అన్నింటికంటే విద్యుత్ సరఫరాలోను పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. వేలాది మందిని ఎన్ కౌంటర్లకు గురి చేశారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల పాలనలో తెలంగాణ పూర్తిగా వివక్షకు లోనైంది.
చర్చల పేరుతో రాజశేఖర్ రెడ్డి నవ్వుతూనే నక్సలైట్ల ఉద్యమకారులను మట్టు పెట్టించారు. ఆ తర్వాత చంద్రబాబు కాంట్రాక్టు వ్యవస్థకు తెర తీశారు. ఔట్ సోర్సింగ్ విధానాలకు వత్తాసు పలికారు. ఆ సమయంలోనే కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తెలంగాణ పోరాటానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చి తాను మగాడినని నిరూపించారు. ఇపుడు రాష్ట్రంలోను, దేశంలోను పరిణతి చెందిన పొలిటికల్ లీడర్ గా ఎదిగారు. తెలంగాణ రాదని పూర్తి నమ్మకంతో ఉన్న చంద్రబాబు తనంతకు తానుగా ఏపీకి వెళ్లిపోయే పరిస్థితిని కల్పించారు ఇక్కడి ప్రజలు. అఖండమైన మెజారిటీని అందించారు.
రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకుడిగా..గులాబీ బాస్ కేసీఆర్ వినుతి కెక్కారు. ఏ సందర్భంలోనూ ఆయనతో పోటీ పడలేక ప్రతిపక్షాలు చతికిలపడ్డాయి. ఇంకో వైపు ఏపీలో పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో పవర్‌లోకి వచ్చిన చంద్రబాబు ..అభివృద్ధి చేసేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు , అమలు చేసిన పథకాలు తమను గట్టెక్కిస్తాయని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. పసుపు కుంకుమ, రైతు బంధు పథకం తనను గెలుపు ఒడ్డుకు చేరుస్తారని తెలుగు తమ్ముళ్లు భరోసాతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక సర్వేలు మాత్రం వైసీపీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందంటూ ఇవే సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ వారి అంచనాలు తప్పాయి..నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ కేంద్రంలో కొలువు తీరింది. మొదట్లో టీడీపీ మోదీతో రాసుకుపూసుకు తిరిగారు. ఆ తర్వాత మిత్రులు శత్రువులుగా మారారు. ఎన్నడూ లేనంతగా కమలనాథులపై తెలుగుతమ్ముళ్లు , నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు. వారు వీరిపై వీళ్లు వారిపై ఆరోపణలు చేసుకుంటున్నారు. నోట్ల రద్దు, నిరుద్యోగం, భారత జాతికి తీరని కష్టాలను తీసుకు వచ్చిన మోడీ పట్ల జనం నిరాశక్తతకు లోనయ్యారు.
చంద్రబాబు పనిగట్టుకుని బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ వయసులో కూడా ఆయన రెస్ట్ అన్నది లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్, దేవెగౌడ, స్టాలిన్, కుమారస్వామి, తదితరులతో ఒకే జట్టుగా కూడగడుతున్నారు. ప్రీపోల్ సర్వేలో హంగ్ ఏర్పడుతుందని, రీజినల్ పార్టీలు కీలక భూమిక పోషించ బోతున్నాయంటూ ఎన్నికల సరళి స్పష్టం చేయడంతో బాబు మరింత స్పీడ్ పెంచారు. ఆ దిశగా ఎవరు పీఎం అవుతారన్నది పక్కన పెడతే బాబు మంత్రాంగం మాత్రం దేశ స్థాయిలో నిరంతరం చర్చ జరగడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి