డెలివ‌రూ కంపెనీకి అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్

ప్ర‌పంచంలోనే ఈకామ‌ర్స్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న అమెరిక‌న్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ప‌లు కంపెనీల‌లో పెట్టుబడులు పెడుతున్న స‌ద‌రు కంపెనీ యుకెలో ఆదాయ‌ప‌రంగా దూసుకెళుతున్న ఫుడ్ కంపెనీ డెలివ‌రూలో ఏకంగా 575 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫుడ్ కంపెనీ 14 దేశాల‌కు విస్త‌రించింది. యుకె, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, సింగ‌పూర్, తైవాన్, ఆస్ట్రేలియా, యుఏఇలో న‌డుస్తోంది. డెలివ‌రూలో పెట్టుబ‌డి పెట్ట‌డంతో అత్య‌ధికంగా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా అమెజాన్ రికార్డ్ బ్రేక్ చేసింది.

అమెజాన్ తోడవ‌డంతో వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో ఒక్క‌సారిగా ఆదాయ వృద్ధి సూచిక ప‌రుగులు పెట్టింది. 1.43 బిలియ‌న్ డాల‌ర్లు అమాంతం పెరిగాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా డెలివ‌రూ ఫుడ్ కంపెనీకి సంబంధించి 80, 000 వేల రెస్టారెంట్లు ఉన్నాయి. 60,000 వేల మంది డెలివ‌రీ చేస్తుండ‌గా..2 వేల 500 ప‌ర్మినెంట్ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే ఫుడ్ రంగంలో పోటీ ప‌డుతున్న ఉబెర్ ఈట్స్ కంపెనీతో డెలివ‌రూ పోటీ ప‌డుతోంది. త‌న‌కు పోటీ ఇస్తున్న డెలివ‌రూ ఫుడ్ కంపెనీని కొనుగోలు చేయాల‌ని ఉబెర్ ఈట్స్ యాజ‌మాన్యం చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేసింది. రెండు సార్లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ ఎందుక‌నో డీల్ కుద‌ర‌లేదు.

పూర్తిగా ఓన్ అప్ చేసుకునేందుకు ట్రై చేశారు. కానీ విఫ‌ల‌మ‌య్యారు. దీనిని గ‌మ‌నించిన అమెజాన్ కంపెనీ డెలివ‌రూ కంపెనీపై దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ అమెరిక‌న్ కంపెనీ ఈకామ‌ర్స్ ప‌రంగా, లాజిస్టిక్ , డిజిట‌ల్ మీడియా ప‌రంగా ఈ కంపెనీ ప్ర‌థమ స్థానంలో ఉంటోంది. అంత‌కంత‌కూ ప్ర‌తి ప్రాంతంలో అమెజాన్ ఉండాల‌ని ..త‌న వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్స్ అండ్ ఛైర్మ‌న్ శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దేశాలు మారినా..క‌స్ట‌మ‌ర్ల రుచుల్లో ఎలాంటి తేడాలు ఉండ‌వు.

ఆయా దేశాల క‌ల్చ‌ర్‌ను అర్థం చేసుకుని వారి అభిరుచుల‌కు అనుగుణంగా ఫుడ్ ఐట‌మ్స్‌ను త‌యారు చేయ‌డం, వారు కోరుకున్న చోటుకు డెలివ‌రీ చేయ‌గ‌లిగితే చాలు..90 శాతం స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని డెలివ‌రూ వ్య‌వ‌స్థాప‌కులు అంటున్నారు. న‌మ్మ‌కంతో పాటు నాణ్య‌త‌కు పెద్ద‌పీట వేస్తూ న‌డుస్తున్న ఈ ఫుడ్ కంపెనీ ఇపుడు టాప్ లో ఉంటోంది. అందుకే అమెజాన్ ఏరికోరి ఈ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టింది. మొత్తం మీద ఉబెర్ ఈట్స్ యాజ‌మాన్యానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది అమెజాన్. వ్యాపార‌మంటే ఇదే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!