బన్నీ ప్రాసలు..త్రివిక్రమ్ పంచ్..లు

మీరే నాకు ప్రాణం. మీరు లేకపోతే నేను లేను. నా కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చింది. ఈ సమయాన్ని నేను ఎంజాయ్ చేశా. చిరజనీవి గారంటే ఎంతో అభిమానం. ఈ శరీరం అంటే కట్టే కాలేంత దాకా నేను ఆయనను మరిచి పోలేను. మీరేమో పవన్ కళ్యాణ్ గూర్చి మాట్లాడమంటున్నారు. ఒకే..చిరు తర్వాత నేను ఇష్టపడే మరో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సర్. వీరిని చూస్తూ పెరిగా అన్నారు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. మ్యూజికల్ కన్సర్ట్‌లో అల్లు అర్జున్ ఉద్వేగంగా మాట్లాడాడు. నా సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది..నేను ఇవ్వలా..వచ్చింది. సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్ వచ్చింది. సినిమా రిలీజ్‌లో గ్యాప్ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్ బ్యాండ్ కల్చర్ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది..ముందు నచ్చేది కాదు....