సిద్దూపై మీనాక్షి ఫైర్

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సింగ్ సిద్దూపై బీజేపీ లీడర్ మీనాక్షి లేఖి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ అనుసరిస్తున్న తీరును ఆమె ఖండించారు. పాకిస్తాన్‌లో నాన్‌ కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడిని తాను  తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎక్కడికి పారి పోయారో తనకు తెలియదని, ఎవరైనా కని పెట్టాలంటూ చురకలంటించారు. పాకిస్తాన్‌లోని మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటు చేసుకుంటుందని ఆరోపించారు. కొన్ని దశాబ్దాలుగా బలవంత మత మార్పిడులు, అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పా​కిస్తాన్‌లో యువతులను బలవంతంగా ఎత్తు కొచ్చి వారికి మత మార్పిడిలు చేసి ముస్లిం అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి అక్కడ వేల సంఖ్యలో జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం అరి కట్టాల్సింది పోయి వారికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడ హింస నిరంతరాయంగా కొనసాగు తుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం సరైందేనని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఏఏ అవసరం దేశంలో ఎంత ఉందనేది పాకిస్తాన్‌లో జరిగిన చర్యలే నొక్కి చెబుతున్నాయని వివరించారు.

సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడులు కాబా, జెరూసలేంపై జరిగిన దాడులతో సమానం అని ఆమె అభివర్ణించారు. ఈ దాడి జరిగిన సమయంలో సిద్దూ ఎక్కడికి పారిపోయాడో తనకు  తెలియదని పేర్కొన్నారు. అతను ఎక్కడున్నాడనేది ఎవరైనా కనిపెట్టాలని, ఒకవేళ ఈ దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐ చీఫ్ ను ఆలింగనం చేసుకుంటాడే మోనన్న విషయాన్ని కాంగ్రెస్ పరిశీలించాల్సిన అవసరం ఉందని మీనాక్షి లేఖీ అభిప్రాయ పడ్డారు. మొత్తం మీద మీనాక్షి చేసిన ఘాటు కామెంట్స్ పై సిద్దూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

కామెంట్‌లు