బన్నీ ప్రాసలు..త్రివిక్రమ్ పంచ్..లు

మీరే నాకు ప్రాణం. మీరు లేకపోతే నేను లేను. నా కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చింది. ఈ సమయాన్ని నేను ఎంజాయ్ చేశా. చిరజనీవి గారంటే ఎంతో అభిమానం. ఈ శరీరం అంటే కట్టే కాలేంత దాకా నేను ఆయనను మరిచి పోలేను. మీరేమో పవన్ కళ్యాణ్ గూర్చి మాట్లాడమంటున్నారు. ఒకే..చిరు తర్వాత నేను ఇష్టపడే మరో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సర్. వీరిని చూస్తూ పెరిగా అన్నారు బన్నీ. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. మ్యూజికల్‌ కన్సర్ట్‌లో అల్లు అర్జున్‌ ఉద్వేగంగా మాట్లాడాడు. నా సినిమాలకు చాలా గ్యాప్‌ వచ్చింది..నేను ఇవ్వలా..వచ్చింది. సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా.

కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌లో గ్యాప్‌ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్‌ బ్యాండ్‌ కల్చర్‌ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది..ముందు నచ్చేది కాదు. కానీ, ఖాళీగా ఉన్న రోజుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సేఫ్‌. అందుకే తన వెంట వెళ్లేవాణ్ణి.. అందరి మ్యూజిక్‌ బ్యాండ్స్‌లో నా పాట ఉండాలి అని తమన్, త్రివిక్రమ్‌గారితో అన్నాను. నేను ఒట్టేసి చెబుతున్నా సామజ వరగమన..పాట ఇంత సెన్సేషనల్‌ అవుతుందని కలలో కూడా అనుకోలేదు.

ఓ రోజు మా ఆవిడ ఇంటికొచ్చి..ఎక్కడ చూసినా ఈ పాటే ప్లే చేస్తున్నారు.. విసుగొస్తోంది.. పైగా అందరూ నన్ను చూసి పాడుతుండటంతో సిగ్గుతో వచ్చేశా అని చెప్పినప్పుడు నాకు అనిపించింది.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కన్నా భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి ఉంటుందని. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రి గారికి, పాడిన సిద్‌ శ్రీరామ్‌, మంచి సంగీతం అందించిన తమన్‌, వీరి ముగ్గుర్ని కోఆర్డినేట్‌ చేసిన త్రివిక్రమ్‌ గారికి, ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ థ్యాంక్స్‌. నాకు తెలిసి మూడుసార్లు ఏ డైరెక్టర్‌తోనూ చేయలేదు.. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్‌ కు ఉన్న నమ్మకం ఎక్కువ..నాకు హిట్‌ సినిమాలు ఇచ్చినందుకు థ్యాంక్స్‌ సార్‌..ఈ సినిమాతో మరో హిట్‌ ఇవ్వబోయేది కూడా ఆయనే.

నన్ను హీరోగా పరిచయం చేసింది నాన్న గారే. కానీ ఏనాడూ వేదికపై, ఇంట్లో ఆయనకు థ్యాంక్స్‌ చెప్పుకోలేదు..నా జీవితంలో మొదటి సారి ధన్యవాదాలు చెబుతున్నా.. నాకు కొడుకు పుట్టిన తర్వాత అర్థమైంది.. నేను మా నాన్న అంత గొప్పవాణ్ణి ఎప్పుడూ అవలేను..ఆయనలో సగం కూడా అవలేను.. థ్యాంక్స్‌ నాన్నా. అరవింద్‌ డబ్బులు తినేస్తారు అంటుంటారు..ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు.. అందుకే దాదాపు 45 ఏళ్లుగా సౌత్‌ ఇండస్ట్రీలో, ఇండియాలోనే మంచి నిర్మాతల్లో ఒక్కరిగా ఉన్నారాయన. మా తాతకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. మా నాన్న గారికి కూడా ఆ అవార్డు ఇవ్వాలని, అందుకు ఆయన అర్హుడని ప్రభుత్వాలను కోరుతున్నా. ఏడాదిన్నరగా ఇంటిలో ఉన్నా నాకు ఈ గ్యాప్‌ ఒక్క సెకనులా అనిపించిందంటే అది నా అభిమానుల వల్లే.. ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు ఆర్మీ ఉంది అని అల్లు అర్జున్‌ అన్నారు.

ఈ చిత్రంలోని ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా రాశారు రచయితలందరూ. అల్లు అర్జున్‌ మంచి సంస్కార వంతుడు. ‘సామజ వరగమన..’ పాటని 13 కోట్ల మంది విన్నారట. అంటే.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారూ మనసుతో విన్నారు. ఈ పాటని నేను చాలా కుర్రతనంతో రాశానని చాలా మంది అన్నారు.. నేను కుర్రాణ్ణి కాదు..అల్లు అర్జున్‌ని అయి పోయానిక్కడ. అంత స్పష్టంగా నాతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్‌. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు అన్నారు సీతారామ శాస్త్రి. సీతారామశాస్త్రి, తమన్‌ ఓ మధ్యాహ్నం కూని రాగం తీసుకుంటూ పాడిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే సామజవరగమన...తన వయసు నుంచి దిగి సీతారామశాస్త్రి గారు, తన స్థాయి నుంచి ఎక్కి తమన్‌ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారని అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

మేం కన్న కల మీ అందరికీ ఓ జ్ఞాపకం అవ్వాలి. మేం అడిగిందల్లా ఇచ్చారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. సంగీతం అంటే మనసు దురద పెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిది. తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసు దురద పెడితే కావాల్సింది సంగీతమే. వేటూరి, ఆ తర్వాత సీతారామశాస్త్రిలు వాడు సినిమా వాడురా నుంచి ఆయన సినిమాకు పాటలు రాస్తాడు అనే స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తులు అన్నారు. అంతకు ముందు థమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఎంతగానో ఆకట్టుకుంది. మరింత అంచనాలు పెంచేసింది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!