పోస్ట్‌లు

సెప్టెంబర్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్టీసీ సమ్మె సైరన్..సంఘాల అల్టిమేటం..!

చిత్రం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎండీకి, యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆర్టీసీకి చెందిన కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో వారు ముందంజలో నిలిచారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇదే సంస్థకు రిటైర్డ్ ఉద్యోగులు గుదిబండగా మారారు. అంతే కాకుండా అద్దె బస్సుల దందా కూడా సంస్థకు భారంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు అతి పెద్ద సంస్థను నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ ఆపేటర్లకు బార్లా తెరిచారు. కాలం చెల్లిన బస్సులు ఇంకా నడుపుతూ ప్రయాణీకుల, ఉద్యోగుల ప్రాణాలతో సంస్థ ఆటాడుకుంటోంది. గతంలో సీఎం అల్లుడు హరీష్ రావు టీఎంయూ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత దాని నుండి వైదొలిగారు. ఇదే సమయంలో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంస్థను టేకోవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు కార్మికులు . సంస్థ అప్పుల్లో ఉందని, దానిని మీరే కాపాడు కోవాలని ఇటీవల సీఎం ప్రకటించారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు మండి పడ్డారు. తెలంగాణల...