ఖరారు కాని ముహూర్తం - ఎవరికి దక్కేనో అదృష్టం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరినా కేబినెట్ విస్తరణ జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఎవరికి చోటు దక్కుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో అటు కేబినెట్ కొలువులతో పాటు నామినేటెడ్ పోస్టుల కోసం క్యూ మొదలైంది. ఊహించని రీతిలో భారీ ఎత్తున ప్రజలు గులాబీకి జై కొట్టడంతో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి పోయింది. పదవులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్యే పోటీ నెలకొంది. గెలిచిన వారితో లెక్కిస్తే మొత్తం 16 మంత్రి పదవులు దక్కున్నాయి. గత కేబినెట్‌లో కొందరు ఓటమి చెందడం పార్టీ అధినేతకు ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆర్‌కు ఆప్తుడిగా పేరొందిన తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావులు ఓడి పోవడం పునరాలోచనలో పడేసింది. ఎలాగైనా సరే తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక ఏదైనా పదవి ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతారో వేచి చూడాల్సిందే. ఎవరికి చోటు కల్పించాలో ..ఎవరిని పక్కన పెట...