రమ్యా..పెళ్లి..వైరల్

సోషల్ మీడియా పుణ్యమా అంటూ క్షణాల్లో పాపులర్ అవుతున్నారు. ఇటీవల టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో నటీనటులు హల్ చల్ చేస్తున్నారు. అనుకోని రీతిలో కొందరు నటీమణులకు పెళ్లిళ్లు అయి పోయా యంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిన్నటి దాకా సోగకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి కూడా న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న రమ్యా నంబీశన్ పెళ్లి చేసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీత, ఆట్ట నాయగన్, ఇళైంజన్ కుళ్లనరి కూట్టం, పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విజయ్ ఆంటోనీకి జంటగా తమిళరసన్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా ఈ కేరళ కుట్టి ఇటీవల మలయాళంలోనూ నటిస్తోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు పట్టు చీర ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలిప్పుడు వైరల్ అవ్వడంతో పాటు నటి రమ్యా నంబీశన్ రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. కొందరు ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. దీంతో షాక్ అయిన రమ్యానంబీశన్ తనకు పెళ్లి అయ్యిందా అంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తూ తన...