కంపెనీల కోసం వేదాంత వేట

భారతీయ వ్యాపార రంగం ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ఒడిడుకులు ఎదుర్కుంటోంది. మోడీ ప్రభుత్వం కొలువు తీరికా వ్యాపారులకు, కంపెనీలకు కష్టకాలం మొదలైంది. ఆర్ధిక రంగం పూర్తిగా పక్కదారి పట్టింది. ఆర్ధిక వృద్ధి రేటు కిందకే తప్ప పైకి ఎగబాకడం లేదు. దీంతో వ్యాపారం నేలచూపులు చూస్తోంది. ఇండియన్ మార్కెట్ లో అత్యధిక వాటా కలిగిన వజ్రాల బిజినెస్ ఊసే లేకుండా పోయింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ చేసిన మోసానికి దాదాపు మొత్తం డైమండ్ పరిశ్రమపై పడింది. దీంతో ఇదే రంగంపై ఆధారపడి బతుకుతున్న 10 లక్షల మంది కార్మికులు రోడ్డు పాలయ్యారు. ఇంత ఇబ్బందులు పడుతున్నా మోడీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా ఓ వైపు ప్రభుత్వ కంపెనీలు ఒకప్పుడు బాగా నడిచేవి.

చాలా సంస్థలు, కంపెనీలకు పెద్ద ఎత్తున నికర, స్థిర ఆస్తులున్నాయి. వీటిని మోడీ, అమిత్ షా కలిసి అమ్మేసే పనిలో పడ్డారు. అయితే దీనికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో పవర్ లోకి వచ్చింది. కొలువు తీరాక దానిని పూర్తిగా మరిచి పోయింది. ఇదే సమయంలో విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కానీ ఇండియాలో వ్యాపార పరంగా లాభాల బాటలో నడుస్తున్న వాటికి కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా ఇదే విషయాన్నీ వేదాంత చైర్మన్ తీవ్ర ఆరోపణ చేశారు. ఇప్పటికే ఇదే కంపెనీ ప్రభుత్వ కంపెనీలను టేకోవర్ చేసుకుంది. అవి లాభాల బాట కూడా పట్టాయి. ఈ మేరకు వేదాంత రానున్న మూడేళ్ళలో   దాదాపు 60,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది.

ఇక వచ్చే 5 ఏళ్లలో 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో ఇప్పటి వరకు వేదాంత కంపెనీ 3,500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. గత పదేళ్లలో హిందుస్తాన్‌ జింక్, బాల్కో, సెసగోవా, కెయిర్న్‌ తదితర మొత్తం 13 కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కంపెనీల కార్యకలాపాలన్నీ సంతృప్తి కరంగా ఉన్నాయని వెల్లడించింది. మరిన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను కొనుగోలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వం విదేశీయులపై కాకుండా తమ లాంటి స్వదేశీ పారిశ్రామిక వేత్తలపైనే ఆధారపడాలని సూచించింది. గ్లాస్, ఆప్టికల్‌ ఫైబర్, కేబుల్‌ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది వేదాంత. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!