సోషల్‌ మీడియాపై డేగ కన్ను

సోషల్ మీడియా దెబ్బకు దేశాలు, బిగ్ చాప్స్ తో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఇండియాలో ఇది మరింతగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, అపరిమితమైన డేటా వినియోగించుకునే వీలుండడంతో డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువై పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీంతో మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటోంది. దీనికే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీనిని కంట్రోల్ లో పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా పోస్టింగ్‌లు పెడితే అంతే సంగతులు. 24 గంటల్లో కేసు నమోదు చేస్తారు.

ఇలా కేసుల్లో ఇరుక్కున్న వారికి లక్ష రూపాయల జరిమానా లేదా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త.. సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌ క్రైం పోలీసులు కన్నేశారు. ఇష్టం వచ్చినట్లు, చూసు కోకుండా ఎలా పడితే అలా పోస్టులు పెడితే ఇట్టే బుక్కవుతారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఆ ఫోన్లు వాడుతున్న వారికి కూడా నెట్‌ అందుబాటులో ఉంటోంది. దీంతో వారు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసి పోతోంది. అయితే, అందులో కొన్ని పోస్టింగ్‌లు, వార్తలు తప్పుగా ఉంటున్నాయి. మరికొన్ని దుష్ప్రచారం కోసం పెడుతున్న పోస్టింగులు ఉంటున్నాయి. పలు పోస్టులు ఆత్మహత్యలు, హత్యలను ప్రేరేపించేలా ఉంటున్నాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అవగాహన లేని అనేక మంది ఒకరు పంపిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లను ఇతరులకు పోస్టు చేయడం ద్వారా క్షణంలో వ్యాపిస్తోంది. ఇలా అనేకమంది పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇష్టా రాజ్యంగా పోస్టులు పెడితే ఇక నుంచి కుదరదు. సైబర్‌క్రైం విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై కన్నేసి ఉంచుతారు. దుష్ప్రచారం, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశం, వ్యక్తిగత ధూషణలు, అసత్య ప్రచారాలను పోస్టు చేసిన వారిని 24 గంటల్లో గుర్తించి, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. కేసు నమోదైతే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగానికి అనర్హలుగా ప్రకటిస్తారు.

కామెంట్‌లు