పొదుపు భవిష్యత్..కు మలుపు

కదిలే కాలంలో జీవన ప్రయాణం మరింత కష్టంగా మారింది. బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు కనీసం వేళల్లో డబ్బులు రావాలి. లేకపోతే జీవించడం కష్టమవుతుంది. ఉన్నదంతా తినేందుకు సరిపోతే ఇక దాచు కోవడం ఎట్లా అన్నది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. తెలివి, అర్హత ఉన్నా చేసేందుకు పని దొరకడం లేదు. కేంద్రంలో బీజేపీ కొలువు తీరాక మరింత తీవ్ర రూపం దాల్చింది నిరుద్యోగం. మనుషులకు భద్రత లేకుండా పోయింది. అంతటా బాధ్యతా రాహిత్యమే రాజ్యమేలుతోంది. దీంతో దినదిన గండం అర్ధాయుస్సు అన్నట్టుగా తయారైంది. సంపాదించిన దాంట్లో కొద్దిగా దాచుకుంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లేక పోతే కస్టాలు కొని తెచ్చుకున్న వారవుతాం. ఇవ్వాళ కొద్ది మొత్తంలో దాచుకున్న డబ్బులు రేపు పెద్ద మొత్తంలో జమ అవుతాయి. అవే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా కలుగ చేస్తాయి. ఇండియాలో ఎక్కువగా పొదుపు చేసే అలవాటు మహిళల్లోనే ఉంటోంది. పొదుపు సంఘాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈ మేరకు పొదుపుపై ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలి...